Home » ISRO
చంద్రయాన్-3 మిషన్‌లో (Chandrayaan-3 mission) భాగంగా చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) విజయవంతంగా ల్యాండింగ్ అయిన నాటి నుంచి ఏదో ఒక ఆసక్తికర సమాచారాన్ని పంచుకుంటున్న ఇస్రో శుక్రవారం మరో ఆసక్తికర వీడియోను షేర్ చేసింది.
ఇస్రో సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతంగా చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవ్వడం.. ల్యాండర్ నుంచి రోవర్ బయటకొచ్చి తన పని మొదలుపెట్టడం అందరికీ తెలిసిందే. అయితే..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గురువారం ‘చంద్రయాన్-3’ మిషన్కి సంబంధించి ‘X’ ఫ్లాట్ఫార్మ్ (ట్విటర్) మాధ్యమంగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. షెడ్యూల్స్ ప్రకారమే యాక్టివిటీస్ కొనసాగుతున్నాయని..
చంద్రయాన్-3 మిషన్‌లో (Chandrayaan) భాగంగా విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) బుధవారం సాయంత్రం జాబిల్లిపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ అయ్యాక యావత్ భారతం ఉప్పొంగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ వేడుకలా సంబరపడ్డారు. మరి చంద్రయాన్-2 విఫలమైనప్పుడు ప్రధాని మోదీ ముందు కన్నీళ్లు పెట్టుకున్న ఇస్రో మాజీ చైర్మన్ కే శివన్ (K Sivan) ఇంకెంత ఆనందించి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాలా!.
చంద్రుడిపై ల్యాండింగ్ ఒక కీలక ఘట్టం మాత్రమే. విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్ చేయాల్సింది చాలా ఉంది. ల్యాండర్ విక్రమ్ నుంచి బుధవారం వేరుపడిన ప్రజ్ఞాన్ రోవర్ పని మొదలుపెట్టింది. ఈ మేరకు గురువారం ఉదయం ఇస్రో (ISRO) ట్విటర్ వేదికగా కీలక అప్డేట్ ఇచ్చింది.
చంద్రయాన్-3 విజయవంతమవడంతో మన దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రయోజనాలు చేకూరబోతున్నాయి. 2025 నాటికి మన దేశ రోదసి ఆర్థిక వ్యవస్థ విలువ 13 బిలియన్ డాలర్లు ఉండవచ్చునని అంచనా. స్టార్టప్ కంపెనీలకు పెట్టుబడులతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని చెప్తున్నారు.
చంద్రయాన్ మిషన్ ఇక్కడితో ఆగిపోయేది కాదు. చంద్రయాన్-3 తర్వాత చంద్రయాన్-4 ప్రయోగాన్ని కూడా ఇస్రో త్వరలో చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును జపాన్‌తో కలిసి భారత్ చేపడుతుందని సమాచారం. ఈ ప్రాజెక్టుకు చంద్రయాన్-4 లేదా లుపెక్స్ అని నామకరణం చేసే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు తెలియజేశాయి.
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం విజయవంతం అయింది.ఈ మిషన్ సక్సెస్‌తో ప్రపంచ దేశాల ముందు ఇస్రో ఇండియాను గర్వపడేలా చేసింది. అయితే ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంలో తెలంగాణ యువకుడు కీలక పాత్ర పోషించారు.
చంద్రయాన్-3 విజయవంతమైన తరుణంలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన లాంచ్ ప్యాడ్‌ను నిర్మించిన ఇంజినీర్లకు దాదాపు 17 నెలల నుంచి జీతాలు అందడం లేదని కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఏ మేరకు ఉందో తెలియడం లేదు.
అందాల చందమామను భారతీయులకు చేరువ చేసిన చంద్రయాన్-3 విజయం మధ్య తరగతి ప్రజలకు స్ఫూర్తిని, ప్రేరణను ఇస్తోంది.