Home » Jagan Mohan Reddy
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన వాన్‌పిక్ కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయాలని పేర్కొంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సోమవారం కొట్టేసింది.
రాష్ట్రంలో గత ఐదేళ్ల జగన్ పాలన మరో ఎమర్జెన్సీని తలపించిందని, నోరు విప్పి ప్రశ్నించడమే పాపం అన్నట్టుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నిప్పులు చెరిగారు.
రాష్ట్రానికే కాదు.. దేశానికి కూడా కీలకమైన వైద్య రంగంలో అవసరమైన అన్ని పరికరాలను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో విశాఖలో గత చంద్రబాబు సర్కారు ఏర్పాటు చేసిన మెడ్ టెక్ జోన్ నిర్వీర్యమైంది.
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారా?
జగన్ సర్కారు కాంట్రాక్ట్ సంస్థను మార్చకుండా యథాతథంగా పనులు కొనసాగించినట్టయితే రూ.1,771 కోట్లతో ఈపాటికి ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఆ క్రెడిట్ చంద్రబాబుకు దక్కుతుందనే అక్కసుతో అధికారంలోకి రాగానే పనులు ఆపేసింది.
ఏమి చేసైనా జగన్ కళ్లలో ఆనందం చూడాలి... ఎలాగైనా పోలీస్ బాస్ పోస్టు సాధించాలి! ఇలాంటి లక్ష్యంతో ఐదేళ్లపాటు చేయకూడని పనులన్నీ నిఘా విభాగం మాజీ చీఫ్ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం కారణంగా వ్యవసాయ అనుబంధ శాఖల్లోని పలు విభాగాల ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు అందకుండా పోయాయి. ఇంకా అనేక శాఖల్లోని క్షేత్రస్థాయి, దిగువ శ్రేణి చిరుద్యోగులకు చిన్న మొత్తాల్లో ఇవ్వాల్సిన జీతాలను....
గత ప్రభుత్వ హయాంలో జగన్ టిడ్కో గృహాలను ఆరువేల కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టి ఆ నిధులను దారి మళ్లించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
జగన్ ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం సరఫరా దారులకు భారీగా బకాయిలు పేరుకుపోయాయి. ఎగ్స్ సరఫరా చేసే కాంట్రాక్టర్లకు రూ.112 కోట్లు, చిక్కీల కాంట్రాక్టర్లకు రూ.66 కోట్లు గత ప్రభుత్వం బకాయి పెట్టింది.
‘పాల్వాయిగేటు వంటి సెన్సిటివ్ పోలింగ్ బూత్‌లో ఒకేఒక హోంగార్డును పెట్టి నడుపుతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతా ఉందని చెప్పడం కోసం పిన్నెల్లి పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఈవీఎం పగలగొట్టే కార్యక్రమం చేశా రు.