Share News

Minister Nimmala: రాష్ట్ర విభజన కన్నా వైసీపీ పాలనలో విధ్వంసం ఎక్కువ: మంత్రి నిమ్మల

ABN , Publish Date - Jul 14 , 2024 | 04:59 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడకి వెళ్లినా ఏ ప్రాజెక్టు చూసినా వైసీపీ పాలనలో జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) చేసిన విధ్యంసమే కనపడుతోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కన్నా.. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసమే ఎక్కువగా ఉందని మంత్రి చెప్పుకొచ్చారు.

Minister Nimmala: రాష్ట్ర విభజన కన్నా వైసీపీ పాలనలో విధ్వంసం ఎక్కువ: మంత్రి నిమ్మల
Minister Nimmala Ramanaidu

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడకి వెళ్లినా ఏ ప్రాజెక్టు చూసినా వైసీపీ పాలనలో జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) చేసిన విధ్యంసమే కనపడుతోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కన్నా.. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసమే ఎక్కువగా ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సోమశిల ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమశిల ప్రాజెక్టుకు ఆప్రాన్ రిపేర్లు కూడా చేయకుండా నిర్లక్ష్యం వహించారని, కనీసం ప్రాజెక్టు గేట్లకు గ్రీజు కూడా పెట్టలేకపోయారని మండిపడ్డారు. అలాంటి వారు పోలవరం డ్యామ్ ఎలా కట్టగలరని మంత్రి ప్రశ్నించారు.


సోమశిల హై లెవల్ కెనాల్‌కి సంబంధించి టీడీపీ ప్రభుత్వం చేసిన పనులు తప్ప వైసీపీ ప్రభుత్వంలో చేసింది సున్నా అని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. యుద్ధ ప్రాతిపదికన ఆప్రాన్ పనులు ప్రారంభించి రాబోయే 60రోజుల్లో పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. ఏపీలో ఐదేళ్ల పాలన చేసి నీటి పారుదల వ్యవస్థను 20సంవత్సరాల వెనక్కి నెట్టేశారని ఆయన ధ్వజమెత్తారు. గతంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ ముందుకుపోయే బాధ్యత ఎన్డేయే ప్రభుత్వంపై ఉందని మంత్రి చెప్పారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ హయాంలో పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నట్లు తనకు ఫిర్యాదులు అందాయని, దీనిపై త్వరలో విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇది కూడా చదవండి:

Durgamma Temple: విజయవాడ దుర్గమ్మకు బంగారు బోనం..

Updated Date - Jul 14 , 2024 | 05:02 PM