Share News

Yanamala: గప్పాలు చెప్పుకున్న వారి తలరాతలు ప్రజలు తిరగరాశేసారు...

ABN , Publish Date - Jul 10 , 2024 | 01:40 PM

Andhraradesh: దేళ్ల వైసీపీ విధ్వంసకర పాలనలో అన్ని రంగాలు వెనక్కి వెళ్లాయి ని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం గుర్తించిన గ్రోత్ ఇంజిన్‌ లైన్ పోలవరం, నదుల అనుసంధానం, ప్రజారాజధాని అమరావతి నిర్మాణం, విద్యుత్, పారిశ్రామిక రంగాలు తదితరాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు.

Yanamala: గప్పాలు చెప్పుకున్న వారి తలరాతలు ప్రజలు తిరగరాశేసారు...
Yanamala Ramakrishnudu

అమరావతి, జూలై 10: ఐదేళ్ల వైసీపీ విధ్వంసకర పాలనలో అన్నిరంగాలు వెనక్కి వెళ్లాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు Forer minister Yanamala Ramakrishnudu) వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం (TDP Government) గుర్తించిన గ్రోత్ ఇంజిన్‌ లైన్ పోలవరం, నదుల అనుసంధానం, ప్రజారాజధాని అమరావతి నిర్మాణం, విద్యుత్, పారిశ్రామిక రంగాలు తదితరాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. సంక్షోభంలో ఉన్న ఏపీ ఆర్థిక వృద్ధి పూర్తిగా కుప్పకూలడాన్ని ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2022-23 వివరంగా తెలియజేస్తుందన్నారు.

Supreme Court: ముస్లిం మహిళలకు ఊరట.. భరణం విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు


జగన్ తప్పుడు విధానాలతో...

వందేళ్ల వ్యవసాయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పంటల సాగు పాతాళానికి పడిపోయిందని తెలిపారు. సాగు నీటి ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం, ఉత్పత్తుల లేక అప్పుల బాధతో రైతులు ఆత్మాహత్యలు చేసుకున్నారని అన్నారు. జగన్ రెడ్డి తప్పుడు విధానాలు, ఆక్వా విద్యుత్ రేట్ల పెంపు, అవినీతి వల్ల మత్య్స ఆక్వా రంగం బలైందని మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితుల దృష్ట్యా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు జంకారన్నారు. వైసీపీ నిర్వహణాలోపంతో ప్రభుత్వాసుపత్రులను నరకకూపాలుగా తయారుచేశారన్నారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని తెలిపారు. విద్యుత్, విద్యా, పర్యాటకం రంగాలను గాలికి భ్రష్టుపట్టించడంతో పాటు ఎన్నడూ లేని విధంగా మీడియాపై ఆంక్షలు విధించారన్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడేందుకు 2014లో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించారని చెప్పుకొచ్చారు.

Hyderabad : 10,000 కోట్లు సిద్ధం?


వైసీపీకి తగిన గుణపాఠం...
సంపద సృష్టిస్తూనే మెరుగైన సంక్షేమ పథకాలు అందించారన్నారు. ఒకవైపు రాష్ట్ర రాజధానిని నిర్మిస్తూనే అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. దాని ఫలితంగా 8.98 స్థూల దేశీయోత్పత్తిని సాధించామని చెప్పారు. ఆర్థిక సర్వేపై స్పందించే దమ్ము, ధైర్యం జగన్‌ రెడ్డి ఉందా? అని ప్రశ్నించారు. అభివృద్ధి విధ్వంసకర విధానాలకు నిదర్శనంగా వాటిని గమనించిన ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపించారన్నారు. ఏమి చేయకుండానే అన్ని చేశామని గప్పాలు చెప్పుకున్నవారి తల రాతలను ప్రజలు తిరగ రాశేసారని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

TDP: ఎమ్మెల్యే గౌతు శిరీష న్యాయపోరాటం

Crime: నంద్యాలలో బాలిక అదృశ్యంపై వీడిన మిస్టరీ..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 10 , 2024 | 04:41 PM