Home » Jagan
గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం తనకు ఉన్న అధికారాలతో ప్రతిపక్ష నాయకులపై, సామాన్యులపై ఎడాపెడా దొంగకేసులు పెట్టింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని సమీక్షిస్తుందనగానే, జగన్ రోతపత్రిక ఉలిక్కిపడుతోంది.
గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ఢిల్లీలో రాష్ట్రం పరువు పోతోంది. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలులో ఆయా శాఖలకు చెందిన అప్పటి రాష్ట్ర అధికారులు వ్యవహరించిన తీరు ఇప్పుడు కొత్త అధికారులకు ఇబ్బందిగా మారింది.
అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టి ప్రజల్లోకి వెళ్లిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(YS Jagan) ఇప్పుడు తాను సామాన్యమైన వ్యక్తినని కవరింగ్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
వైసీపీ(YSRCP) పాలనలో సీఎం చంద్రబాబుని (CM Chandrababu Naidu) ఎన్ని అవమానాలకు గురి చేశారో గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) అన్నారు.
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో పరాభవం ముటగట్టుకున్న వైసీపీకి మరో షాక్ తగలబోతోందా. అంటే అవుననే సంకేతాలిస్తున్నాయి తాజా పరిణామాలు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో ఉన్న నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి రావడానికి క్యూ కడుతున్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో సీనియర్లు కనిపించడం లేదట. అధికారంలో ఉన్నప్పుడు రోజూ మీడియా ముందు కనిపించే నేతలు.. గత రెండు నెలలుగా ఏమైందో ఏమో గాని ప్రజల్లో కనిపించడంలేదనే టాక్ వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు ఇంకా పూర్తికాలేదు. కానీ ఐదేళ్ల జగన్ పాలనతో పోల్చినప్పుడు 50 రోజుల్లోనే సీఎంగా చంద్రబాబు మార్క్ పాలన ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమైంది.
విశాఖపట్టణంలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించడం సొంత పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
నెల్లూరు జిల్లాలో మాస్ పొలిటీషియన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాజకీయాల్లో ఆయన స్టైలే వేరు. తాను నమ్మిన వ్యక్తుల కోసం ఎంతకైనా తెగిస్తారు. తనను అనుమానించినా.. అవమానించినా ఆత్మగౌరవాన్ని చంపుకుని ఒక్కనిమిషం ఉండరు.
బెల్లం ఉన్న దగ్గరే ఈగలు వాలతాయనే సామెత అందరికీ తెలిసిందే.. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్కు ఈ సామెత సరిగ్గా సరిపోతుందనే చర్చ జరుగుతోంది.