Home » Jaggareddy
తెలంగాణ మంత్రులు అంతా కలసి కట్టుగా ఉన్నారని, నేతల్లో ఎలాంటి విభేదాలు లేవని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మా కెప్టెన్ సీఎం రేవంత్ రెడ్డి అని తేల్చి చెప్పారు. రేవంత్ నేతృత్వంలో గల టీమ్ ప్రజల కోసం పనిచేస్తుందని జగ్గారెడ్డి వివరించారు.
తెలంగాణ కాంగ్రెస్ (Congress) పార్టీకి కొత్త బాస్‌పై ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష రేసులో ఎవరు ఉన్నారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటు ఏ సామాజికవర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుదన్న విషయంపై ఏఐసీసీ కూడా దృష్టి సారించింది.
లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని.. ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో తాము అధికారంలో ఉన్నాం కదా అని ఎవరికి ఇబ్బంది కలిగేంచేలా ప్రవర్తించలేదని చెప్పారు.
మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించినా పర్వాలేదు కానీ ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎ్‌సపై కాంగ్రె్‌సకు భారీ మెజారిటీ ఇవ్వాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.
రైతులందరికీ ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారని, దైవసాక్షిగా కూడా ప్రమాణం చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.
దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనేనని, ఆయన ప్రధాని అయితేనే దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జీవితాల్లోకి వెలుగులు వస్తాయని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
Telangana: పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ స్పీచ్‌లు చూసి బీజేపీ నాయకుల్లో దడ మొదలైందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంగళవరం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకం కాదని బాఘవత్ ప్రెస్ రిలీజ్‌కి కారణం రాహుల్ గాంధీ స్పీచ్ అని చెప్పుకొచ్చారు. ఢిల్లీ పోలీసు గాంధీ భవన్ నోటీసులు తీసుకురావటం కూడా దీనిలో భాగమే అని మండిపడ్డారు.
రాహుల్ గాంధీ దెబ్బకు మోదీ, అమిత్ షా, మోహన్ భాగవత్‌లు ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) స్క్రిప్ట్ లీడర్ అని.. ఆయనకు హిందూ సాంప్రదాయం గురించి ఏమాత్రం తెలియదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. బీజేపీ రాష్ట్రాల అధ్యక్షులు అందరూ డమ్మిలేనని విమర్శించారు. ఎల్కే అద్వానీ భిక్షతోనే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని చెప్పారు.
తమ పదవులు, రాజకీయ భవితవ్యం... సోనియా, రాహుల్‌గాంధీ కష్ట ఫలితమేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాజీవ్‌గాంధీని హత్య చేసిన వారినే క్షమించేసిన గుణం సోనియా, రాహుల్, ప్రియాంకది అని గుర్తు చేశారు.