Share News

T. Jaggareddy: కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా

ABN , Publish Date - May 25 , 2024 | 03:16 AM

పాతికమంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. ఆయన చెప్పింది జరిగితే ఆయనకు సన్మానమూ చేస్తానని చెప్పారు.

T. Jaggareddy: కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా

  • 25 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరితే ఆయనను సన్మానిస్తా

  • బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా రేవంత్‌ సర్కారుకు ఢోకా లేదు

  • పదేళ్లు కేటీఆర్‌, హరీశ్‌లు దందాలే చేశారా?: జగ్గారెడ్డి

హైదరాబాద్‌, మే 24(ఆంధ్రజ్యోతి): పాతికమంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. ఆయన చెప్పింది జరిగితే ఆయనకు సన్మానమూ చేస్తానని చెప్పారు. ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీ నేతలు ప్రొఫెసర్లని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఢోకా లేదన్నారు. వచ్చే ఐదేళ్లూ ఆయనే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కిషన్‌రెడ్డి కూడా దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి దారిలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.


మంచి పనిచేస్తే.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రశంసించే గుణం వాజ్‌పేయీదన్నారు. నిండు పార్లమెంటులో వాజ్‌పేయి.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని దుర్గామాతతో పోల్చారని గుర్తుచేశారు. పాతికమంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరుతున్నారంటూ కిషన్‌రెడ్డి అన్నారంటే.. 5 నెలల కాంగ్రెస్‌ పాలన బాగుందని ఆయన ఒప్పుకున్నట్లే కదా అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేల్లోనూ కొంతమంది బయటకొస్తారని అనుకుంటున్నామని చెప్పారు. ధాన్యానికి మద్ద తు ధర నిర్ణయించేది కేంద్రమేనని పేర్కొన్నారు. కేటీఆర్‌, హరీశ్‌రావులు సీఎం రేవంత్‌పైన బుర ద చల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వారు దందాలు చేశారని చెప్పి.. తాము కూడా చేసినట్లు భ్రమపడి మాట్లాడుతున్నారన్నారు. మంత్రి జూపల్లిపైన కేటీఆర్‌ అభాండాలు వేస్తున్నారని, రాష్ట్రంలో హత్యారాజకీయాలు లేవని, ప్రభుత్వమూ దాన్ని ప్రోత్సహించబోదని జగ్గారెడ్డి చెప్పారు.

Updated Date - May 25 , 2024 | 03:16 AM