Home » Jaggareddy
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్రమోదీలకు నిద్ర పట్టడం లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. బీజేపీ నేతలు తాము దేశభక్తులమంటూ డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఏపీలో ప్రధాన పార్టీల అధినేతలపై వరుసగా రాళ్ల దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై జరిగిన రాళ్ల దాడి ఘటనలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాముడు దేవుడేనని, కానీ ఆయనను ఓ పార్టీకీ లీడర్‌ను చేశారని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు....
మెదక్‌లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని... ఇతర పార్టీలు బీసీలను పట్టించుకోలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. నేడు పఠాన్ చెరు మండలం గణేష్ గడ్డ గణేష్ దేవస్థానం వద్ద కాంగ్రెస్ ప్రచార రథాలకు పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ అని ఆ పార్టీ నేత జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఉగాది పర్వదినం నేపథ్యంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీకి రాజ పూజ్యం 16 ఉంటే.. అవమానం 2 ఉందని చెప్పారు. తాను పీసీసీ అధ్యక్ష పదవి అడగడం కొత్తేమి కాదన్నారు. అయితే అవకాశం వచ్చిన ప్రతీ సారి తాను పీసీసీ పీఠం అడుగుతానని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ కొట్లాటలు ఉండొద్దని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో కొండాపూర్ మండలం మల్కాపుర్‌లోని వెంకటేశ్వర గార్డెన్లో కాంగ్రెస్ (Congress) కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌పై (KCR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మేడిగడ్డనా? బొందలగడ్డనా? ఏం పీకడానికి మేడిగడ్డకు పోతున్నారు’’ అని కేసీఆర్ మాట్లాడారని.. ముఖ్యమంత్రిగా పని చేసిన ఓ వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటం సమంజసమేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ టికెట్‌పై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ కావాలనుకుంటే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతానని అన్నారు.
ఎమ్మెల్సీ కవిత నాటకం, సురభి నాటకం ఒక్క రోజులో అయిపోదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. నేడు మీడియాతో మాట్లాడుతతూ.. కవిత లిక్కర్ అంశం సీరియల్ లాంటిదన్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్‌పై జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కి కాంగ్రెస్ సంప్రదాయం తెలుసన్నారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిగా కాకుండా బీఆర్ఎస్, బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి (Jaggareddy) ఆరోపించారు. ఆదివారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు గెలవడమే తమ టార్గెట్ అన్నారు. లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చినప్పుడు ఎంపీ బండి సంజయ్.. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందని చెప్పారని ఏమైంది..? అని ప్రశ్నించారు.