Jaggareddy: కవిత నాటకం, సురభి నాటకం ఒక్క రోజులో అయిపోదు
ABN , Publish Date - Feb 26 , 2024 | 01:19 PM
ఎమ్మెల్సీ కవిత నాటకం, సురభి నాటకం ఒక్క రోజులో అయిపోదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. నేడు మీడియాతో మాట్లాడుతతూ.. కవిత లిక్కర్ అంశం సీరియల్ లాంటిదన్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్‌పై జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కి కాంగ్రెస్ సంప్రదాయం తెలుసన్నారు.
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) నాటకం, సురభి నాటకం ఒక్క రోజులో అయిపోదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి (Jaggareddy) విమర్శించారు. నేడు మీడియాతో మాట్లాడుతతూ.. కవిత లిక్కర్ అంశం సీరియల్ లాంటిదన్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ (KTR)పై జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. మాజీ సీఎం కేసీఆర్ (KCR)కి కాంగ్రెస్ (Congress) సంప్రదాయం తెలుసన్నారు.
కేటీఆర్‌కి కాంగ్రెస్ గురించి ఏమీ తెలియదన్నారు. కేటీఆర్.. తండ్రి చాటు బిడ్డ అని పేర్కొన్నారు. మొన్నటి వరకూ సీఏం కొడుకని.. ఇప్పుడు మాజీ సీఏం కొడుకు అని అన్నారు. ముందే ముఖ్యమంత్రిని ప్రకటించే సంప్రదాయం కాంగ్రెస్‌లో లేదని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌పై కేసీఆర్ ఏమైనా విమర్శలు చేస్తే సమాధానం చెప్పేవాళ్లమన్నారు. కేటీఆర్‌కి ఏం తెలుసని ఆయన మాటలకు రియాక్ట్ కావాలని ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.