TG Elections: బీజేపీ నేతలు గ్రాఫిక్స్ హీరోలు.. జగ్గారెడ్డి విసుర్లు
ABN , Publish Date - Apr 19 , 2024 | 05:09 PM
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్రమోదీలకు నిద్ర పట్టడం లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. బీజేపీ నేతలు తాము దేశభక్తులమంటూ డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ (BJP) గ్రాఫ్ పడిపోవడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్రమోదీలకు నిద్ర పట్టడం లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. బీజేపీ నేతలు తాము దేశభక్తులమంటూ డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అసలైన దేశభక్తులు రాహుల్ గాంధీ కుటుంబమేనని చెప్పారు. రాహుల్ గాంధీకి డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. డూప్లికేట్ బీజేపీ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు గ్రాఫిక్స్ హీరోలని సెటైర్లు గుప్పించారు. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో పస లేదని చెప్పారు. కేసీఆర్ కామెంట్లపై జగ్గారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
CM Revanth: కేసీఆర్ కాలం చెల్లింది.. కారు షెడ్డుకు పోయింది.. సీఎం రేవంత్ వ్యంగ్యాస్త్రాలు
శుక్రవారం నాడు గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ బయటకు వస్తే తమ అస్త్రాలు తాము బయటకి తీస్తామన్నారు. రేవంత్ రెడ్డి తోపు, భట్టి విక్రమార్క ఇంకో రకం తోపు, ఉత్తమ్ బ్రిలియంట్, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ తోపే.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేణుక చౌదరి, జీవన్ రెడ్డి, వీహెచ్ తోపులు... పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు తోపులేనని అన్నారు. కాంగ్రెస్‌లో అందరూ తోపులేనని చెప్పారు. కేసీఆర్ ఏం చేసినా తమకు ఏం కాదన్నారు. బీఆర్ఎస్‌లో ముగ్గురు, బీజేపీలో ఇద్దరు మాత్రమే లీడర్లని చెప్పారు. కాంగ్రెస్‌లో లీడర్లకు కొదవ లేదన్నారు.
TS Politics: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే?
తాము పాండవులమని.. విజయం తమవైపే ఉంటుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంపై ఏఐసీసీకి పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. కేసీఆర్ ఏం మాట్లాడినా తమ వ్యూహం తమకు ఉందన్నారు. తాము చాలా అలెర్ట్‌గా ఉన్నామన్నారు. కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నాడని.. ఆయన మాటలని ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదని చెప్పారు. తమకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తుందన్నారు.
రేవంత్ రెడ్డి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ మాటలకు ఆగస్టులో సమాధానం చెబుతామని మందలించారు. తమ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కి టచ్‌లో ఉన్నారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారా అనేది ఎంపీ ఎన్నికలు అయ్యాక తెలుస్తుందన్నారు. ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ ఏ ఆలోచనతో అన్నారో ఆయనకే తెలియాలన్నారు. కేసీఆర్ ఏం చేసినా దాన్ని ఎలా తిప్పికొట్టాలో తమకు తెలుసునని జగ్గారెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి
Congress: రైతుల రుణమాఫీ ఎప్పుడో చెప్పిన మంత్రి పొన్నం
Raghunandan rao: హరీష్‌రావు ఆ గట్టునుంటారో?.. ఈ గట్టునుంటారో?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...