Home » JanaSena Party
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పార్టీ ఒక్కో షాక్ తగులుతోంది. గత పాలనలో జరిగిన తప్పులు ఒక్కొటి వెలుగులోకి వస్తోన్నాయి. మరోవైపు వైసీపీకి శ్రేణులు, నేతలు షాక్ ఇస్తున్నారు. విశాఖపట్టణానికి చెందిన కార్పొరేటర్లు వైసీపీని వీడారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఐదుగురు కార్పొరేటర్లకు పవన్ కల్యాణ్ కండు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 97శాతం స్ట్రైకింగ్ రేట్‌తో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
మచిలీపట్నంలో పట్టాభి సీతారామయ్య కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం పనులన త్వరగా ప్రారంభించాలని జనేసన లోక్ సభాపక్ష నేత బాలశౌరి కోరారు.
టాలీవుడ్ సినీ నటి, యూట్యూబర్ శ్రీరెడ్డిపై (Sri Reddy) పోలీసు కేసు నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితలపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు...
రాష్ట్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే.. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఎన్నికల ముందు వరకు జనసేనను చులకనగా చూసినవారంతా.. ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీని ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా చూస్తున్నారు.
తెనాలి మండలం తేలప్రోలులో జనసేన కార్యకర్తపై ప్రత్యర్థులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తేలప్రోలు గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త షేక్ ఫయాజ్ బాషా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో గ్రామంలోని వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి.
తాజా మాజీ ఎమ్మెల్యేకి పదవి పోయినా గతంలో ఆయనకు ప్రభుత్వం కేటాయించిన స్టిక్కర్ మాత్రం ఊడలేదు..! నెంబరు ప్లేట్‌కు...
రాష్ట్ర శాసన మండలిలో గతంలో పని చేసిన పెద్దల మార్గదర్శకంలో ముందుకెళ్తానని జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అన్నారు.
విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన మధురవాడ ఐటీ హిల్స్ ప్రాంతంలో ఎన్సీసీకి కేటాయించిన భూమిని వైసీపీకి చెందిన కొందరు నేతలు బినామీ పేర్లతో స్వాధీనం చేసుకున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపించారు.
పర్యావరణ హితంగా వేడుకలు, ఉత్సవాలు చేసుకుంటే మేలని, వినాయక చవితికి మట్టి విగ్రహాలను పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.