Share News

Sri Reddy: సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు.. త్వరలో అరెస్ట్!

ABN , Publish Date - Jul 20 , 2024 | 04:53 PM

టాలీవుడ్ సినీ నటి, యూట్యూబర్ శ్రీరెడ్డిపై (Sri Reddy) పోలీసు కేసు నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితలపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు...

Sri Reddy: సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు.. త్వరలో అరెస్ట్!
Actress Sri Reddy

కర్నూలు: టాలీవుడ్ సినీ నటి, యూట్యూబర్ శ్రీరెడ్డిపై (Sri Reddy) పోలీసు కేసు నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితలపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన ఈ కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకున్న కర్నూలు టీడీపీ బీసీ సెల్ నాయకుడు రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కర్నూలు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే శ్రీరెడ్డిని విచారణకు పిలిచేందుకు.. ఆ తర్వాత అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి.


Case-On-Sri-Reddy-1.jpg

అరెస్ట్ చేయాల్సిందే..!

టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి కించపరిచే విధంగా శ్రీరెడ్డి మాట్లాడారని.. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదని.. విషపు ఆలోచనలు ఉన్నవారు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారని రాజు యాదవ్ మండిపడ్డారు. ఈమెను ఆదర్శంగా చేసుకుని మిగిలిన వాళ్లు కూడా ఇలా మాట్లాడే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. అందుకే శ్రీరెడ్డిని అరెస్ట్ చేసి తగిన బుద్ధి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా.. ఎన్నికల ముందు ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసు నమోదయ్యింది. ఈ కేసు వ్యవహారంపై ఇంతవరకూ శ్రీరెడ్డి మీడియా, సోషల్ మీడియా వేదికగా ఎక్కడా స్పందించలేదు.


Raju-Yadav.jpg

నోరు తెరిస్తే..!

శ్రీరెడ్డి వైసీపీ మద్దతురాలు. గత కొన్నేళ్లుగా వైసీపీకి సపోర్టు చేస్తూ వస్తున్నారు.! టీడీపీ, జనసేన కార్యకర్తలు, నేతలు.. అధినేతలపై శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలే చేస్తూ వస్తున్నారు. ఆఖరికి ఎన్నికల ముందు టీడీపీపై ఇష్టానుసారం పచ్చి బూతులు కూడా మాట్లాడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఈమె నోరు తెరిస్తే అబ్బో ఆ మాటలు నోటితో పలకలేం.. రాతల్లో రాయలేం అంతే..! సంబంధంలేని విషయాలను కూడా ఆయా పార్టీలకు అంటగడుతూ నిత్యం ఏదో ఒక వీడియో చేయడం.. అందులోకి టీడీపీ, జనసేన నేతలను లాగడం శ్రీరెడ్డికి పరిపాటే.! వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మొదలైన తిట్ల వ్యవహారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈమె నోటికి అడ్డు అదుపూ లేకుండా మాటలు వచ్చేస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా ఆయా పార్టీ కార్యకర్తలు తిట్టిపోస్తూనే ఉన్నారు. ఆఖరికి శ్రీరెడ్డి సపోర్టు చేస్తున్న వైసీపీ కార్యకర్తలు సైతం.. విమర్శలు గుప్పిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందనేది ఇక ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాగా.. నటిగా శ్రీరెడ్డి చేసింది అరకొర సినిమాలే అయినా వివాదాల్లో మాత్రం నిత్యం మునిగి తేలుతుంటారనే ఆరోపణలు మాత్రం కోకొల్లలు.

Updated Date - Jul 20 , 2024 | 04:53 PM