Home » Jayashankar Bhupalapally
Telangana: జిల్లాలోని మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పుట్ట నరసింహస్వామి అనే వ్యక్తి... నల్ల అవినాష్(25)పై కత్తితో దాడి చేశాడు. తన భార్యతో నల్ల అవినాష్ అక్రమ సంబంధం పెట్టుకున్నడనే అనుమానంతో నర్సింహులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని అదే స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
లక్ష కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ అంధకారంగా మారిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ను రాహుల్ సందర్శించారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ డ్యామేజీని పరిశీలించారు. దాదాపు గంటన్నరపాటు రాహుల్ పర్యటన కొనసాగింది. అయితే కాళేశ్వరం సందర్శన తర్వాత రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు.
అవును.. తెలంగాణలో ఎన్నికలకు (TS Assembly Polls) ముందు రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయ్. హ్యాట్రిక్ కొట్టాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్(BRS) కు అడుగడుగునా ఊహించని షాక్లే తగులుతున్నాయి...
కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఆరు గ్యారంటీలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కాపీ కొట్టారని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. గురువారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. వేలంపాట పెట్టినట్టుగా తాము అనౌన్స్ చేసిన పథకాలే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచారన్నారు.
భూపాలపల్లిలోని 1 ఇంక్లైన్ గేట్ దగ్గర సింగరేణి కార్మికులతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గురువారం ఉయదం గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్మికుల సమస్యలను రేవంత్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్ష భాగస్వాములన్నారు.
జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి టార్గెట్గా కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని..
జిల్లాలో వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో మోరంచవాగు పొంగిపొర్లడంతో ఊరు మొత్తం వరదల్లో మునిగిపోయింది.
వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి గ్రామాస్థులు సురక్షితంగా బయటపడ్డారు. భారీ వర్షాల కారణంగా మోరంచవాగు పొంగిపొర్లడంతో గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరింది. గ్రామంలోని ఇళ్లు నీటమునిగాయి. దీంతో అక్కడి ప్రజలు భవనాలపైకి వచ్చి తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. మోరంచపల్లి గ్రామస్తుల పరిస్థితిపై సీఎం కేసీఆర్ సైతం స్పందించారు.