CM Revanth: మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకున్న రేవంత్ బృందం
ABN , Publish Date - Feb 13 , 2024 | 04:36 PM
Telangana: కాళేళ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చేరుకుంది. ఈరోజు ఉదయం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరి వెళ్లారు.
జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 13: కాళేళ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ (Medigadda Barrage) వద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బృందం చేరుకుంది. ఈరోజు ఉదయం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరి వెళ్లారు. కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డి బృందం మేడిగడ్డకు చేరుకుంది. పిల్లర్ కుంగిన చోటును సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. రేవంత్ వెంట మంత్రులు తుమ్మల, ఉత్తమ్, జూపల్లి, పొన్నం, సీతక్క ఉన్నారు. అలాగే ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మేడిగడ్డ సందర్శనకు వచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ప్రభుత్వం ఆహ్వానం మేరకు ప్రజా ప్రయోజనాల కోసం వచ్చిన సీపీఐ ఎమ్మెల్యే, ఎంఐఎం ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు తెలిపారు. మొట్ట మొదటి సారి ప్రాజెక్టు విజిట్ కోసం వచ్చారన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల లక్ష కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు. బీఆర్‌ఎస్ చేసిన తప్పిదాలను ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తుందన్నారు. వేలాది మంది ప్రజలు ప్రాజెక్టు కోసం తమ భూములను ఇచ్చారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మెడిగడ్డ బ్యారేజ్ సందర్శన కోసం అందరికీ ఆహ్వానం ఇచ్చామన్నారు. 94 వేల కోట్లతో కాళేశ్వరం నిర్మాణం చేశారన్నారు. దీనికి గల బాధ్యులను ప్రభుత్వం గుర్తించిందన్నారు. కొందరిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. డీజీ రాజీవ్ రతన్, ఇరిగెషన్ అధికారులతో రివ్యూ చేస్తామన్నారు. లక్ష కోట్లకు భారీగా వడ్డీలు తెచ్చి నిర్మాణం చేశారన్నారు. దీని వల్ల ఎకరం భూమికి నీరు అందలేదని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...