University VC's: రాజ్‌భవన్‌కు చేరిన వీసీల నియామక పత్రాలు
ABN , Publish Date - Oct 11 , 2024 | 03:40 AM
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల (వీసీ) నియామకానికి సంబంధించిన పత్రాలు గవర్నర్ కార్యాలయానికి చేరాయి.
హైదరాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల (వీసీ) నియామకానికి సంబంధించిన పత్రాలు గవర్నర్ కార్యాలయానికి చేరాయి. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, తెలుగు యూనివర్సిటీ, జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన వర్సిటీ వీసీల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం సెర్చ్ కమిటీల సమావేశం నిర్వహించింది. కమిటీల భేటీలో ప్రభుత్వం ఏ విశ్వవిద్యాలయానికి ఎవరిని వీసీగా ఎంపిక చేయాలనేది ఖరారు చేసింది.
సంబంధిత పత్రాలను గవర్నర్ ఆమోదానికి పంపించారు. ఆయన ఆమోదించిన వెంటనే వీసీల నియామకానికి సంబంధించి విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. కాగా, వివిధ కారణాల వల్ల అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయాల వీసీల ఎంపికకు సంబంధించి సెర్చ్ కమిటీల సమావేశాలు వాయిదా పడ్డాయి. దీంతో ఈ నియామకాలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.