Home » JDS
ముడా ఇంటి స్థలాల అక్రమాలలో ముఖ్యమంత్రి(Chief Minister) కుటుంబానికి భాగస్వామ్యం ఉందని నిరసిస్తూ బీజేపీ(BJP) చేపట్టిన చలో మైసూరు పాదయాత్ర విజయవంతంగా సాగుతున్న తరుణంలో మరో యాత్ర చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. అనంతరం మరో పాదయాత్ర చేయాలని బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారు.
‘నా ఆస్తులు బహిరంగం చేస్తా... కుమారస్వామి సోదరుడు బాలకృష్ణ గౌడ ఆస్తులు చెప్పాలి’ అని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) సవాల్ విసిరారు. సోమవారం మద్దూరులో కాంగ్రెస్ ప్రజాందోళన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రమంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy) తనను ప్రశ్నిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేహక్కు అందరికీ ఉందని అన్నారు.
జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు వచ్చిన శృంగార వీడియోలు వాస్తవమైనవేనని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది...
లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన జేడీసీ తాజాగా అడ్డం తిరిగింది. కర్ణాటక బీజేపీ తలపెట్టిన పాదయాత్రకు తమ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు.
బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు తీర్పును నిలిపివేయడానికి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం నిరాకరించింది.
మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా)లో తన భార్యకు ఇంటి స్థలాలు కేటాయించడంలో అవినీతి జరగలేదని అయినా బీజేపీ, జేడీఎస్ సభ్యులు తనకు చెడ్డపేరు తీసుకురావాలనే కుట్ర పన్నారని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(CM Siddaramaiah) మండిపడ్డారు. తాను రెండోసారి సీఎం కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
‘నా కొడుకు తప్పు చేసి ఉంటే ఉరి తీయండి’... అంటూ శాసనసభలో మాజీ మంత్రి, జేడీఎస్ నేత రేవణ్ణ(Former minister and JDS leader Revanna) విరుచుకుపడ్డారు. ప్రతిపక్షనేత అశోక్ వాల్మీకి కార్పొరేషన్‌కు సంబంధించిన అవినీతి కేసును విచారిస్తున్న సిట్ అధికారుల తీరుకు, ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) కేసులో సిట్ ప్రవర్తించిన విధానాన్ని పోల్చారు.
అసహజ లైంగిక దౌర్జన్యం ఆరోపణతో అరెస్టయిన జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ కేసులో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది.
ఈవీఎంల కారణంగానే జేడీఎస్, బీజేపీలకు ఆశించినంతకంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలు వచ్చాయని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) ఆరోపించారు. బీబీఎంపీ కార్యాలయంలో గ్యారెంటీల అమలు కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఇకపై సినిమాలకు గుడ్‌బై చెబుతున్నానని, పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితం అవుతానని జేడీఎస్ యువ విభాగం అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి(Nikhil Kumaraswamy) తెలిపారు. మండ్యలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక సినిమాలు చేయదలచుకోలేదని అన్నారు. పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానని తెలిపారు.