Share News

Union Minister: జేడీఎస్‌ నిర్వీర్యానికే.. ఆపరేషన్‌ హస్త కుట్ర

ABN , Publish Date - Jan 05 , 2025 | 03:06 PM

జేడీఎస్‌ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే ఆపరేషన్‌ హస్త కుట్ర పన్నారని కేంద్రమంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy) సంచలనమైన ఆరోపణలు చేశారు. బెంగళూరు(Bangalore)లో కుమారస్వామి మీడియాతో మాట్లాడారు.

Union Minister: జేడీఎస్‌ నిర్వీర్యానికే.. ఆపరేషన్‌ హస్త కుట్ర

- ప్రలోభ పెట్టినట్లు ఎమ్మెల్యేలు స్వయంగా చెప్పారు..

- 12 మందిని పార్టీ మార్చే ప్రయత్నాలు జరిగాయి

- కేంద్రమంత్రి కుమారస్వామి సంచలన ఆరోపణ

బెంగళూరు: జేడీఎస్‌ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే ఆపరేషన్‌ హస్త కుట్ర పన్నారని కేంద్రమంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy) సంచలనమైన ఆరోపణలు చేశారు. బెంగళూరు(Bangalore)లో కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్‌ పార్టీకి చెందిన 12-13 మంది ఎమ్మెల్యేలను పార్టీ మార్పించే ప్రయత్నాలు జరిగాయన్నారు. అయితే జేడీఎస్‌ ఎమ్మెల్యేలను మార్పు చేయడం అంత సులువు కాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాపాలు పెరిగాయన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Minister: బాలకృష్ణన్‌కు మతిభ్రమించిందా ఏంటీ..


తమ ఎమ్మెల్యేలు తనకు పూర్తీ సమాచారం అందించారన్నారు. సంక్రాంతి ముగిసే దాకా ఏమీ మాట్లాడేది లేదన్నారు. జేడీఎస్‌ ఇటువంటి కుట్రలకు భయపడేది లేదని, జేడీఎ్‌సను ఎప్పటికీ నిర్వీర్యం చేయలేరన్నారు. దేవుడే కాంగ్రెస్‏కు తగిన శిక్ష వేస్తారన్నారు. దేశంలో గ్యారెంటీలకు పోటీ పడుతున్నారన్నారు. తొలుత అమలు చేసిన హిమాచల్‌ ప్రదేశ్‌(Himachal Pradesh) పరిస్థితి ఏం జరిగిందో తెలిసిందేనన్నారు. రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గ్రాంట్ల కోసం ఎన్ని తంటాలు పడుతున్నారో అందరికీ తెలుసన్నారు.


pandu1,2.jpg

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఆత్మాభిమానం ఉంటే ప్రభుత్వం ఏదిశగా వెళుతుందో దృష్టి సారించాలన్నారు. మైసూరులో ప్రిన్స్‌స్(మహారాణి) పేరుతో ఉండే రోడ్డుకు సిద్దరామయ్య పేరు పెట్టాలనే ప్రస్తావనపై ఆయన ఎద్దేవా చేశారు. కర్ణాటకకే సిద్దరామయ్య పేరు పెడితే బాగుంటుందన్నారు. మరో ప్రశ్నకు సమాధానంగా తమ పార్టీ సీనియర్‌ నేత జీటీ దేవెగౌడతో తనతో భార్యాభర్తల సంబంధమన్నారు. ఎన్నోసార్లు గొడవలు జరుగుతాయని ఆతర్వాత సమిసిపోతాయన్నారు.


ఈవార్తను కూడా చదవండి: ‘తెలుగు‘లో చదివితే ఉద్యోగాలు రావన్నది అపోహే

ఈవార్తను కూడా చదవండి: KTR: కేంద్రంలో చక్రం తిప్పుతాం

ఈవార్తను కూడా చదవండి: DK Aruna: చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలి

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం అభివృద్ధిపై మంత్రి తుమ్మల కీలక నిర్ణయాలు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 05 , 2025 | 03:06 PM