Union Minister: కాంగ్రెస్ పార్టీవి కల్లబొల్లి మాటలు.. ఆ జిల్లాకు వారు చేసిందేమీ లేదు..
ABN , Publish Date - Dec 24 , 2024 | 12:14 PM
కాంగ్రెస్ నేతలు చెప్పేవి కల్లబొల్లి మాటలని, హాసన్ జిల్లాకు కాంగ్రెస్ చేసిందేమీ ఏమీ లేదని, సీడీలు విడుదల చేయడమే వారి గొప్ప అని కేంద్రమంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy) ఎద్దేవా చేశారు. హా
బెంగళూరు: కాంగ్రెస్ నేతలు చెప్పేవి కల్లబొల్లి మాటలని, హాసన్ జిల్లాకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని, సీడీలు విడుదల చేయడమే వారి గొప్ప అని కేంద్రమంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy) ఎద్దేవా చేశారు. హాసన్ జిల్లాలో సోమవారం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. జిల్లాకు దేవెగౌడ కుటుంబం చేసింది ఏమిటని ఇటీవల డీసీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: పచ్చమలై అడవుల్లో 126 రకాల సీతాకోక చిలుకలు
హాసన్ జిల్లాకు కాంగ్రెస్ నాయకులు ఏం చేశారని తిరిగి ప్రశ్నించారు. సీడీలు విడుదల చేసి ఎంతో సాధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాసన్ అభివృద్ధి అనేది దేవెగౌడ(Deve Gowda) రాజకీయ ప్రారంభం నుంచి కొనసాగించిన రోజునుంచే జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. వీరు ఓ ఫ్లై ఓవర్ సాధించలేదని, సిగ్గు లేకుండా మాట్లాడతారన్నారు. తాను సీఎంగా ఏమి చేశాననేది జిల్లాలో అందరికీ తెలుసునన్నారు. పలు అభివృద్ధి పనులకు తన హయాంలోనే శ్రీకారం చుట్టానన్నారు. తమ కుటుంబం ప్రజల సొమ్మును లూటీ చేయలేదన్నారు.
ప్రకృతిని లూటీ చేసిన వారెవ్వరనేది అందరికీ తెలిసిందేనన్నారు. దొంగే దొంగ..దొంగ..అన్నట్లుగా కాంగ్రెస్ నేతల మాటలు ఉన్నాయన్నారు. కేంద్రమంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy) చన్నరాయపట్టణ తాలూకాలోని దేవీరమ్మ దేవి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పలు ఆలయాలను సందర్శించారు. అనంతరం కాఫీ రైతులతో జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌తో కలసి పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Revanth Reddy: సంక్రాంతికి వస్తున్నాం!
ఈవార్తను కూడా చదవండి: మహిళా గ్రూపులతో 231 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించండి: సీఎస్
ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: విచారణకు రండి..
ఈవార్తను కూడా చదవండి: Cybercrime: బరితెగించిన సైబర్ నేరగాళ్లు
Read Latest Telangana News and National News