Share News

Nikhil: ఓడిపోవడం బాధే.. అలాగని కుంగిపోయేది లేదు

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:43 PM

చెన్నపట్టణ(Chennapatna) ఎన్నికల్లో ఓడిపోవడం బాధ కలిగించిందని నాకంటే నా అభిమానులు, కార్యకర్తలు మరింత నిరాశ చెందారని అలాగని కుంగిపోయేది లేదని జేడీఎస్‌ యువ నాయకుడు నిఖిల్‌(Nikhil) బహిరంగలేఖ రాశారు.

Nikhil: ఓడిపోవడం బాధే.. అలాగని కుంగిపోయేది లేదు

- మా ఎమ్మెల్యేలు సంతలో సరుకులా..?

- గెలిచామనే అహం మంచిది కాదు

- నిఖిల్‌ బహిరంగ లేఖ

బెంగళూరు: చెన్నపట్టణ(Chennapatna) ఎన్నికల్లో ఓడిపోవడం బాధ కలిగించిందని నాకంటే నా అభిమానులు, కార్యకర్తలు మరింత నిరాశ చెందారని అలాగని కుంగిపోయేది లేదని జేడీఎస్‌ యువ నాయకుడు నిఖిల్‌(Nikhil) బహిరంగలేఖ రాశారు. సోషల్‌మీడియాలో లేఖను బుధవారం విడుదల చేశారు. ఎందుకు ఓడిపోయాననేది ఇప్పటికే కారణాలు చెప్పానన్నారు. జేడీఎ్‌సలో ఓటమికి భయపడే పరిస్థితి ఉండదన్నారు. గెలుపుకోసం తనతోపాటు ఎంతోమంది శక్తివంచన లేకుండా పనిచేశారన్నారు. 87వేలమంది ఓట్లు వేశారన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Trains: హైదరాబాదు నుంచి శబరిమలైకి రేణిగుంట మీదుగా 18 ప్రత్యేక రైళ్లు


ప్రజాతీర్పును తలవంచి గౌరవిస్తున్నానన్నారు. విచిత్రం ఏమంటే గెలుపొందినవారికి ప్రశాంతతలేదని, వారిముఖంలో సంతోషం లేదన్నారు. ఇంకా ప్రమాణస్వీకారం చేయలేదని, కానీ అప్పుడే రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు సిద్ధమై ఓ క్రిమినల్‌లా మాట్లాడుతున్నారన్నారు. మా ఎమ్మెల్యేలను ఖాళీ చేస్తానని సవాల్‌ చేస్తున్నారని, వారేమైనా సంతలో సరుకులా అన్నారు. ఎన్నికల్లో గెలవచ్చు అంతమాత్రాన అహం పనికిరాదన్నారు.


‘సత్యమేవ జయతే’ను నమ్ముతానని ఎన్నికల్లో ఓడానని అంతమాత్రాన కార్యకర్తలకు దూరమయ్యే పరిస్థితి లేదన్నారు. పార్టీ ఇచ్చిన టాస్క్‌లో పాల్గొన్నానన్నారు. కేవలం నామినేషన్లకు రెండు మూడు రోజుల ముందు తనని అభ్యర్థిగా ఖరారు చేశారన్నారు. అయితే నిఖిల్‌ రాసిన లేఖ సంచలనమైంది. వరుసగా మూడుసార్లు ఎన్నికలలో ఓటమి చెందినా కార్యకర్తలు కుంగిపోరాదనే రీతిలో రాసిన లేఖ స్ఫూర్తిగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Khammam: దంపతుల దారుణ హత్య

ఈవార్తను కూడా చదవండి: Bhatti: క్రిస్మస్‌ వేడుకలకు ఏర్పాట్లు చేయండి

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: సరగసీ కోసం తెచ్చి లైంగిక వేధింపులు

ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఇథనాల్‌ ఫ్యాక్టరీకి అనుమతులు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2024 | 12:44 PM