Home » JDS
కర్ణాటకలో పొత్తులతో లోక్‌సభ ఎన్నికలకు వెళ్తున్న బీజేపీ, జేడీఎస్ మధ్య సీట్ల పంపకాలు ఖరారు అయ్యాయి. మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 25 సీట్లలో, జేడీఎస్ 3 సీట్లలో పోటీ చేయనున్నాయి.
జేడీఎస్‌తో తమ పొత్తు కొనసాగుతుందని, చిన్నచిన్న అపోహలు ఉంటే వాటిని సరిదిద్దుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర(BJP state president B Y Vijayendra) ప్రకటించారు.
మండ్య లోక్‌సభ స్థానం బీజేపీ(BJP)తో పొత్తులో భాగంగా జేడీఎస్ పరం కావడంతో ఇక్కడి నుంచి కుమారస్వామి లేదా నిఖిల్‌కుమార్‌లలో ఒకరు అభ్యర్థి కానున్నారు. జేడీఎస్ పార్టీ రెండు నెలల కిందటే మండ్యనుంచి మాజీ మంత్రి పుట్టరాజు పోటీ చేసేలా సూచించింది.
లోక్‌సభ ఎన్నికల్లో కుమారస్వామి పోటీపై బీజేపీ అగ్రనేతలు, ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) నిర్ణయం తీసుకుంటారని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) తెలిపారు.
కర్ణాటక నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సీట్ల షేరింగ్ విషయంలో బీజేపీతో ఎలాంటి సమస్యలు లేవని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను తాను, తన కుమారుడు నిఖిల్ న్యూఢిల్లీలో కలిసామని, సీట్ల షేరింగ్‌పై చర్చలు జరిపామని చెప్పారు.
అయోధ్యలో రామమందిరం ప్రారంభమైన తర్వాతే బీజేపీ-జేడీఎస్(BJP-JDS) మధ్య సీట్ల వ్యవహారం ఒక కొలిక్కి రానుంది. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత హెచ్డీ కుమారస్వామి(HD Kumaraswamy) ఢిల్లీలో మీడియాకు చెప్పారు.
కేంద్రంలో మరోసారి బీజేపీకి అవకాశాలు ఉన్నాయనే సర్వేలతో కుమారస్వామి జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించారు. రాష్ట్రంలో బీజేపీ(BJP)తో జేడీఎస్ పొత్తుపెట్టుకున్న తరుణంలో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఐఎన్డీఐఏ (ఇండియా) కూటమి తరపున మల్లికార్జునఖర్గేను ప్రధానిని చే యాలని పలు పార్టీల నేతలు ప్రస్తావిస్తుంటే ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం రాహుల్‌గాంధీ కావాలని వ్యాఖ్యానించడం ఆయన సంకుచిత స్వభావానికి నిదర్శనమని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి(JDS leader and former CM Kumaraswamy) మండిపడ్డారు.
రాష్ట్రరాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరొందిన మాజీ ప్రధాని దేవేగౌడ(Former Prime Minister Deve Gowda) నేరుగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ(Prime Minister Modi)తో భేటీ అయి డీల్ కుదుర్చుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో పక్కా కుదుర్చుకున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం జరగనున్నట్లు తెలుస్తోంది. జేడీఎస్ కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి(Former Chief Minister HD Kumaraswamy)