Amit Shah: రేవణ్ణ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు.. అమిత్ షా సూటిప్రశ్న
ABN , Publish Date - Apr 30 , 2024 | 01:01 PM
కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని క్షమించే ప్రసక్తే లేదని..
కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) స్పందించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఆయన.. నారీ శక్తికి తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. కర్ణాటకలో (Karnataka) కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని.. అక్కడ లా & ఆర్డర్ కాంగ్రెస్ (Congress) చేతిలో ఉందని.. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అది ఆ రాష్ట్రానికి సంబంధించిన శాంతిభద్రతల అంశమని అన్నారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వరుడిని ఇరకాటంలో పడేసిన ‘మోదీ’ పేరు.. ఎందుకో తెలుసా?
కర్ణాటకలో బీజేపీతో జేడీఎస్ పొత్తు ఉందన్న విషయాన్ని గుర్తు చేసిన అమిత్ షా.. మా భాగస్వామి పార్టీ సైతం రేవణ్ణపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే జేడీఎస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిందని గుర్తు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని, నేరం రుజువైతే శిక్షించాలని డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం బీజేపీ కోర్ కమిటీ సమావేశం ఉందని, ఇది ముగిసిన తర్వాత ప్రజ్వల్ రేవణ్ణపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా.. తనకు సంబంధించినవిగా చెప్తున్న వీడియోలు బయటకు వచ్చిన తరుణంలో, ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అటు.. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై సిట్ విచారణ జరిపిస్తోంది.
నకిలీ వీడియోపై తీవ్రంగా మండిపడ్డ అమిత్ షా
ఇదిలావుండగా.. తనతో పాటు తన తనయుడిపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ (HD Revanna) పేర్కొన్నారు. అవి నాలుగైదేళ్ల క్రితం నాటి పాత వీడియోలని, వాటిని చూపించి కుట్ర చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చట్టపరంగా దీనిని ఎదుర్కుంటామని.. ఇలాంటి వాటికి భయపడి పారిపోయే వ్యక్తిని కానని తెలిపారు. ప్రజ్వల్‌ను పార్టీ నుంచి బహిష్కరించే నిర్ణయాన్ని జేడీఎస్ (JDS) హైకమాండ్‌కు వదిలేస్తున్నట్లు చెప్పారు.
Read Latest National News and Telugu News