Share News

Karnataka: అత్యాచార బాధితులకు ఆర్థిక సాయం.. సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం

ABN , Publish Date - May 06 , 2024 | 08:54 AM

అత్యాచారానికి గురైన అనేక మంది మహిళలు సమాజంలో వివక్ష ఎదుర్కొంటుండటంతో వారికి ఆర్థిక సాయం అందించేందుకు సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) సర్కార్ నిర్ణయించింది. అత్యాచార బాధితులందరికీ ఆర్థిక సాయం చేయడానికి విధివిధానాలను త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

Karnataka: అత్యాచార బాధితులకు ఆర్థిక సాయం.. సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం

బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ మనువడు ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) మహిళలపై జరిపిన ఆకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్న తరుణంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది వరకే రేవణ్ణ అత్యాచార వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అతనిపై విచారణ నిమిత్తం కన్నడ సర్కార్ సిట్ వేసింది.

అత్యాచారానికి గురైన అనేక మంది మహిళలు సమాజంలో వివక్ష ఎదుర్కొంటుండటంతో వారికి ఆర్థిక సాయం అందించేందుకు సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) సర్కార్ నిర్ణయించింది. అత్యాచార బాధితులందరికీ ఆర్థిక సాయం చేయడానికి విధివిధానాలను త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.


ప్రజ్వల్ రేవణ్ణ బాధిత మహిళలను ఆదుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇదివరకే సీఎం సిద్ధరామయ్యను కోరారు. రాహుల్ మాట్లాడుతూ.. "ఇలాంటి దారుణ ఘటనలను పార్టీలకతీతంగా అందరూ ఖండించాలి. రేవణ్ణ సెక్స్ స్కాండల్ నిరూపితమైతే అతనికి కఠిన శిక్ష పడాలి. ప్రజ్వల్‌ భారత్ విడిచి వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అనుమతిచ్చింది. భయంకరమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, రేపిస్ట్ కోసం ప్రధాని మోదీ ప్రచారం చేశారు" అని రాహుల్ ఆరోపించారు.


బాధితులకు పరిహారం..

జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ రాసలీలల వివాదంలో బాధిత మహిళలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వనుందని కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్‌సింగ్‌ సుర్జేవాలా వెల్లడించారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మాట్లాడారు. బాధితులకు సీఎం సిద్దరామయ్య న్యాయం చేస్తారని అన్నారు. ఇదే విషయంపై అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా సీఎంకు లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు.

వందలాదిమందిపై లైంగిక వేధింపులు దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఎక్కడా చోటు చేసుకోలేదని అన్నారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడిన వ్యక్తికి మద్దతుగా ప్రధాని మోదీ ఎలా ప్రచారం చేశారని సూర్జేవాలా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాలపై ప్రధాని మోదీ మౌనం వీడాలని ఏఐసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు అల్కాలంబ డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, జాతీయ మహిళా కమిషన్‌ చైర్మన్‌ రేఖా శర్మ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.


BJP: పార్టీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన బీజేపీ.. ఎందుకంటే

మూడు రోజుల కస్టడీకి హెచ్‌డీ రేవణ్ణ..

కిడ్నాప్‌ వివాదం కేసులో అరెస్టయిన జేడీఎస్‌ ఎమ్మెల్యే, ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్‌డీ రేవణ్ణను సిట్‌ మూడు రోజుల కస్టడీకి తీసుకుంది. బెంగళూరులోని బౌరింగ్‌ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించిన అధికారులు అనంతరం మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచి, మూడు రోజుల కస్టడీకి అనుమతి తీసుకున్నారు. ఆయన్ను విచారించేందుకు ఈ నెల 8 వరకు మెజిస్ట్రేట్‌ అవకాశం కల్పించారు. అంతకు ముందు రేవణ్ణ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ, ఎలాంటి ఆధారం లేకుండానే తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. కిడ్నాప్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

For Latest News and National News click here

Updated Date - May 06 , 2024 | 09:59 AM