Home » JDU
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా బీహార్ లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూకు 14 సీట్లను బీజేపీ ఆఫర్ చేయగా, చిరాగ్ పాశ్వాన్, పశుపతి పరస్‌కు-6 సీట్లు బీజేపీ ఆఫర్ చేసింది. ఉపేంద్ర కుష్వాహ, మాంఠీ (హెచ్ఏఎం)కు చెరో సీటు ఇవ్వనుంది. బీజేపీ 17 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ఒకే దేశం - ఒకే ఎన్నికలు విధానానికి వివిధ పార్టీల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తుండగా మరికొన్ని స్వాగతిసున్నాయి.
బీహర్‌లో నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీలో సోమవారం నాడు నితీశ్ కుమార్ బలం నిరూపించుకోవాల్సి ఉంది.
బిహార్ సీఎం నితీశ్ కుమార్ త్వరలో అసెంబ్లీలో బల పరీక్షకు వెళ్తున్న వేళ.. ఆర్జేడీ(RJD)కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కనిపించకకుండా పోవడం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. నితీశ్(Nitish Kumar) మహాఘట్బంధన్ను వీడి బీజేపీ(BJP)లో చేరిన అనంతరం మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ "ఆట ముగియలేదు" అని కామెంట్స్ చేశారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు మించి బీజేపీ, జేడీయూ పొత్తు ఉండదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. 2025లో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే నితీష్ యూ టర్న్ తీసుకునే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.
Tejashwi Yadav First Reaction On Nitish: నితీష్ కుమార్ యాదవ్ మహాఘట్బంధన్ నుంచి వైదొలిగిన తరువాత తొలిసారి స్పందించారు ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్. జేడీ(యూ)(JDU)-బీజేపీ(BJP) కలిసి అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.. కానీ, బీహార్‌లో ఆట ఇంకా ముగియలేదు, అసలు గేమ్ ముందుంది అని ఫస్ట్ కామెంట్ చేశారు తేజస్వి యాదవ్.
బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామాపై(Nitish Kumar Resign) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) ఘాటుగా స్పందించారు. కలబురిగిలో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. దేశంలో ఆయా రామ్, గయా రామ్‌లాంటి రాజకీయ నేతలు ఎక్కువైపోయారని పరోక్షంగా నితీశ్‌ని ఉద్దేశించి అన్నారు.
బీహార్ రాజకీయాల్లో తలెత్తిన సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి, బీజేపీతో కలిసి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వ్యూహరచన చేస్తుండగా, నితీష్‌ను అక్కున చేర్చుకునేందుకు బీజేపీ అధిష్ఠానం హస్తినలో పావులు కదుపుతోంది. ఇదే సమయంలో భవిష్యత్ కార్యాచరణపై ఆర్జేడీ సైతం వరుస సమావేశాలు జరుపుతోంది.
బీహార్‌లో నితీష్ కుమార్ సారథ్యంలోని మహాకూటమి నిట్టనిలువుగా చీలనుందా? జేడీయూ, ఆర్జేడీ మధ్య తలెత్తిన లుకలుకలు పతాకస్థాయికి చేరుకున్నాయా? కమలనాథులతో తిరిగి నితీష్ జేడీయూ పొత్తు పెట్టుకుని అధికారం కొనసాగించనుందా? అవుననే స్పష్టమైన కథనాలు వెలువడుతున్నాయి. బీజేపీ మద్దతుతో నితీష్ కుమార్ ఏడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి.