NDA Alliance: 4 కాదు.. 8 ఏళ్లు!
ABN , Publish Date - Jun 11 , 2024 | 05:04 AM
లోక్‌సభ ఎన్నికల అనంతరం ఎన్డీయే మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్జేపీ (రామ్ విలాస్) అగ్నిపథ్ పథకాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించాయి. తాజాగా భారత సైన్యం కూడా ఈ పథకాన్ని సమీక్షించి దాన్ని మెరుగుపర్చాలని సిఫారసు చేసింది. నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత రెగ్యులర్ సర్వీసుల్లో చేరే అగ్నివీర్ల శాతాన్ని ప్రస్తుతం ఉన్న 25 నుంచి 60-70 శాతానికి పెంచాలనే సిఫారసు కూడా దీనిలో ఉంది.
అగ్నివీర్ల సర్వీసు వ్యవధిని పెంచాలి
70 శాతం మందిని రెగ్యులర్ చేయాలి
ప్రవేశ వయస్సుని 23 ఏళ్లకు పెంచాలి
అగ్నిపథ్‌ను సమీక్షించాలని ఆర్మీ సిఫారసు
న్యూఢిల్లీ, జూన్ 10: లోక్‌సభ ఎన్నికల అనంతరం ఎన్డీయే మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్జేపీ (రామ్ విలాస్) అగ్నిపథ్ పథకాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించాయి. తాజాగా భారత సైన్యం కూడా ఈ పథకాన్ని సమీక్షించి దాన్ని మెరుగుపర్చాలని సిఫారసు చేసింది. నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత రెగ్యులర్ సర్వీసుల్లో చేరే అగ్నివీర్ల శాతాన్ని ప్రస్తుతం ఉన్న 25 నుంచి 60-70 శాతానికి పెంచాలనే సిఫారసు కూడా దీనిలో ఉంది.
అగ్నివీర్ల సర్వీస్ వ్యవధిని 4 ఏళ్ల నుంచి 7-8 సంవత్సరాలకు పెంచాలని, సాంకేతిక రంగంలో అగ్నివీర్ల ప్రవేశ వయస్సుని పెంచాలని ఆర్మీ సూచించింది. అలాగే శిక్షణ సమయంలో అంగవైకల్యానికి గురైన అగ్నివీర్లకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని, ఒకవేళ యుద్ధంలో మరణిస్తే వారి కుటుంబానికి జీవనభృతి ఇవ్వాలని సిఫారసు చేసింది. యువతకు అవకాశాలు కల్పిస్తూనే సైన్యంపై ఆర్థిక భారం తగ్గించే ఉద్దేశంతో మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు 2022లో అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. అప్పట్లో దీనిపై సర్వత్రా ఆందోళనలు వెల్లువెత్తాయి.