JDU on LS Speaker: లోక్‌సభ స్పీకర్ పదవిపై జేడీయూ వైఖరి ఇదే...
ABN , Publish Date - Jun 14 , 2024 | 03:19 PM
లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్డీయే భాగస్వామిగా ఉన్న జనతా దళ్ యూనైటెడ్ పోటీలో ఉందనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ తమ వైఖరిని వెల్లడించింది. స్పీకర్ పదవికి భారతీయ జనతా పార్టీ నామినేట్ చేసే అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి శుక్రవారంనాడు తెలిపారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్డీయే (NDA) భాగస్వామిగా ఉన్న జనతా దళ్ యునైటెడ్ (JDU) పోటీలో ఉందనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ తమ వైఖరిని వెల్లడించింది. స్పీకర్ పదవికి భారతీయ జనతా పార్టీ (BJP) నామినేట్ చేసే అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి (KC Tyagi) శుక్రవారంనాడు తెలిపారు. టీడీపీ, జేడీయూలు ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్నాయని, బీజేపీ నామినేట్ చేసే వ్యక్తికి తాము మద్దతిస్తామని చెప్పారు.
Assembly by-polls: ఉపఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ
''స్పీకర్ ఎప్పుడూ రూలింగ్ పార్టీ నుంచే ఉంటారు. ఎందుకంటే భాగస్వామ్య పార్టీల కంటే వారి సంఖ్య ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది'' అని కేసీ త్యాగి చెప్పారు. కాగా, జూన్ 26న కొత్త స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 18వ లోక్‌సభ తొలి సమావేశం జూన్ 24న ప్రారంభమై జూలై 3తో ముగుస్తుంది. సమావేశాల తొలి రెండు రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది. 26న స్పీకర్ ఎన్నిక, 27న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు.