Home » Jharkhand
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జార్ఖండ్(Jharkhand)లో పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేస్తున్న క్రమంలో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం(Alamgir Alam) వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న సంజీవ్ లాల్ సహాయకుడి ఇంట్లో నుంచి భారీ మొత్తంలో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దేశంలోని అవినీతిపరుల మాస్కులను ఎన్డీయే ప్రభుత్వం తొలగించివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
లోక్ సభ ఎన్నికల వేళ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పరస్పర ఆరోపణలతో రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ(PM Modi) మే 4న జార్ఖండ్ పాలములోని ఎన్నికల ర్యాలీలో(Lok Sabha Polls 2024) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్, జేఎంఎం నేతలపై మోదీ విరుచుకుపడ్డారు.
దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వదిలిపోయిందన్ని ఈ వైరస్ రక్కసి మళ్లీ జన సంచారంలోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా జార్ఖండ్‌లో సైతం బర్డ్ ఫ్లూ కేసులు విజృంభించాయి.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean) అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి (INDIA Bloc)వినూత్నంగా నిరసన తెలిపింది. ఆదివారం కూటమి ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా జార్ఖండ్‌లో మెగా ర్యాలీ నిర్వహించారు. ఇందులో 28 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. అక్రమంగా తమ నేతలను అరెస్టు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
వేసవి కాలం కావడంతో దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విపరీతంగా వేడి గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇలాంటి సమయంలో విద్యార్థులు బయట తిరిగితే ప్రమాదమని భావించిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నాయి.
పబ్బుల్లో.. క్లబ్బుల్లో మత్తు కోసం కుర్రకారు వాడుతున్న గంజాయిని ఎలుకలు ఫుల్లుగా కొట్టాయి. అది కూడా అంతా ఇంతా కాదండోయ్.. ఏకంగా 19 కేజీల డ్రగ్స్‌ని ఖాళీ చేసేశాయి. ఏంటీ.. ఎలుకలు గంజాయిని కొట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా?.. నమ్మలేకపోయినా ఇదే నిజమని జార్ఖండ్‌లోని ధన్‌బాద్ పోలీసులు చెబుతున్నారు. కోర్టుకు కూడా ఇదే సమాధానం ఇచ్చారు.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జ్యుడీషియల్ కస్టడీని పెంచుతూ రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జార్ఖండ్‌లో జేఎంఎంకు గట్టి షాక్ తగిలింది. జేఎంఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు, జేఎంఎం నేత సీత సోరెన్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే భారతీయ జనతా పార్టీలో చేరారు. శిబు సోరెన్ పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ సతీమణీ సీత సోరెన్. అనారోగ్యంతో దుర్గా సోరెన్ మరణించారు. ఆ తర్వాత సీత సోరెన్‌ను శిబు సోరెన్ ఇతర కుటుంబ సభ్యులు పట్టించుకోలేదట.
తెలంగాణ కొత్త గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. సోమవారం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.