Share News

PM Modi: మీ ఓటు అవినీతి కాంగ్రెస్‌ని మట్టుబెట్టింది.. జార్ఖండ్ వేదికగా మోదీ ఘాటు విమర్శలు

ABN , Publish Date - May 04 , 2024 | 01:07 PM

లోక్ సభ ఎన్నికల వేళ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పరస్పర ఆరోపణలతో రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ(PM Modi) మే 4న జార్ఖండ్‌ పాలములోని ఎన్నికల ర్యాలీలో(Lok Sabha Polls 2024) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్, జేఎంఎం నేతలపై మోదీ విరుచుకుపడ్డారు.

PM Modi: మీ ఓటు అవినీతి కాంగ్రెస్‌ని మట్టుబెట్టింది.. జార్ఖండ్ వేదికగా మోదీ ఘాటు విమర్శలు

Ranchi: లోక్ సభ ఎన్నికల వేళ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పరస్పర ఆరోపణలతో రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ(PM Modi) మే 4న జార్ఖండ్‌ పాలములోని ఎన్నికల ర్యాలీలో(Lok Sabha Polls 2024) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్, జేఎంఎం నేతలపై మోదీ విరుచుకుపడ్డారు.

ఆయన మాట్లాడుతూ.. ఒక్క ఓటు అవినీతిమయమైన కాంగ్రెస్‌ని అధికారం నుంచి తొలగించేలా చేసిందని విమర్శించారు. అదే ఓటు.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిందని, జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దయ్యేలా చేసిందని, ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టిందని అన్నారు.


"ఇది అమరవీరుడు నీలాంబర్ పీతాంబరుడి భూమి. 2014లో మీ ఒక్క ఓటు ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. కాంగ్రెస్ అవినీతి ప్రభుత్వాన్ని తొలగించింది. మీ ఓటు విలువను గుర్తించండి. జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఆంధ్రప్రదేశ్‌లలో నక్సలైట్లు విస్తరిస్తున్నారు. వారి దాడుల్లో చాలా మంది తల్లులు తమ పిల్లలను కోల్పోయారు. మిగిలిన వారు ఆయుధాలు పట్టుకుని అడవి వైపు పరిగెత్తారు. నక్సలిజానికి ప్రభావితమయ్యారు.

మీ ఓటు అలాంటి వారందరినీ రక్షించింది. వారి తల్లుల ఆశలను నెరవేర్చింది. 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న నేను ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పని చేశాను. ఇప్పటివరకు నాపై ఎలాంటి అవినీతి మరక లేదు. నాకు సొంత ఇల్లు లేదు. సైకిల్ కూడా లేదు. అవినీతి జేఎంఎం, కాంగ్రెస్ నాయకులు తమ పిల్లల కోసం భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు. అలాంటి వారికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. జార్ఖండ్‌లో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి" అని మోదీ ప్రజలను కోరారు.


2019 ఫలితాలు.. 2024 పోలింగ్ వివరాలు

జార్ఖండ్‌లో 14 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019లో BJP 11 సీట్ల, దాని మిత్రపక్షమైన AJSU ఒక స్థానాన్ని గెలుచుకుంది. మిగిలిన రెండింటిలో ఒకటి కాంగ్రెస్‌, మరొకటి JMM గెలుపొందాయి. రాజధాని రాంచీలో మే 25న పోలింగ్ జరగనుంది. జార్ఖండ్‌లో నాలుగు దశల్లో మే 13, 20, 25, జూన్ 1 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి.

For Latest News and National News click here

Updated Date - May 04 , 2024 | 01:08 PM