Home » Jobs
రాష్ట్రంలో ప్రతి ఏటా జూన్ నెలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి, డిసెంబరులోపు నియామక ప్రక్రియలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జాబ్ క్యాలెండర్‌పై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ హామీలను పూర్తిగా విస్మరించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయడం లేదని, కేసీఆర్ హయాంలో కంటే.. రేవంత్ ప్రభుత్వంలోనే పోలీసులు రెచ్చిపోతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతదేశంలోని ఐటీ రంగంలో ఉద్యోగాల వెల్లువ రాబోతుంది. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్(Infosys) నుంచి ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ కంపెనీ 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 15,000 నుంచి 20,000 ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకోనునున్నట్లు తెలిపింది.
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఉద్యోగం పొందవచ్చు.
ఇండియన్ ఆర్మీ... షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 57వ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
కర్ణాటక కోటా బిల్లు తీవ్ర దుమారం రేపతోంది. ప్రైవేట్ కంపెనీలు, ఇండస్ట్రీస్‌లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని సిద్ధరామయ్య ప్రభుత్వం భావించింది. ఆ బిల్లుపై ఇంటా బయటా సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బెంగళూర్‌లో ఉండే స్థానికేతరుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఫోన్ పే కో ఫౌండర్ సమీర్ నిగమ్ స్పందించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘లాడ్లా భాయ్ యోజన’ అనే పేరుతో ప్రకటించిన ఈ స్కీమ్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ శిక్షణతో పాటు స్టైపెండ్‌ను అందించనుంది.
విమానాశ్రయ లోడర్ ఉద్యోగాల కోసం ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ముంబయి విమానాశ్రయం వద్ద చేపట్టిన భర్తీ కార్యక్రమం మంగళవారం దాదాపు తొక్కిసలాట వంటి పరిస్థితికి దారితీసింది.
నిత్యం ఏదో ఒక అంశంలో ప్రజల్ని కేటుగాళ్లు మోసం చేస్తూనే ఉన్నారు. ప్రతి రోజూ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులు, బెట్టింగ్ యాపుల్లో డబ్బులు పెట్టి మరికొందరు, ఆన్ లైన్ మోసాలకు ఇంకొందరు బలైపోతున్నారు. మ్యాట్రిమోనీ సైట్లు, డేటింగ్ యాప్‌ల ద్వారా యువతీయువకులు సైతం మోసపోతున్నారు. మీ పేరుతో లాటరీ తగిలిందని ఆ నగదు మెుత్తాన్ని మీ ఖాతాలో వేయాలంటే చెప్పిన లింక్‌పై క్లిక్ చేయాలంటూ మరికొందరిని బురిడీ కొట్టిస్తున్నారు.