Home » KA Paul
ఈ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా బరిలో దిగుతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. అయితే తనను ఓడించడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కలిశాయని ఆయన ఆరోపించారు.
విశాఖలో విలువైన భూములను వైసీపీ నాయకులు కబ్జాలు చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆరోపించారు. సీబీసీఎన్సీ క్రైస్తవ భూములలో కేఏ పాల్, బాబు మోహన్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎంవీవీ సత్యనారాయణ మనసు మార్చుకొని లాండ్స్ని బాపిస్ట్ సంఘాలకు సంబంధించిన యాజమాన్యానికి అప్పగించాలంటూ కేఏ పాల్ ప్రార్థన చేశారు.
బీజేపీ(BJP)కి తెలంగాణలో ఓటు బ్యాంకు లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(Ka Paul) అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని చెప్పారు. ఇటివలే తమ పార్టీలో చేరిన బాబు మోహన్ వరంగల్ నుంచి పోటీలో ఉంటారని అన్నారు. ఆయనకు ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తున్నామని తెలిపారు.
Telangana: నల్గొండ జిల్లా అభివృద్ధిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు అబద్దపు మాటలు చెపుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు కాలేదన్నారు. తమ్ముడు రేవంత్ రెడ్డి వచ్చి తనను చాలా సార్లు కలిశారని.. తెలంగాణ వాటర్ మినిస్టర్ను మార్చమని చెప్పానని తెలిపారు. ఇంకో తమ్ముడు కోమటిరెడ్డి చాలా చెపుతున్నారని... రైతుబందు డబ్బులు ఐదు వేల కోట్లు ఎటు పోయాయని ప్రశ్నించారు.
ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న తరుణంలో.. ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) దూకుడు పెంచారు. తన మాటల తూటాలకు మరింత పదును పెట్టారు. అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తూనే.. తనదైన హామీలు ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని అమెరికా చేసే సత్తా తనకు మాత్రమే ఉందన్నారు.
తనను విశాఖ ఎంపీగా గెలిపిస్తే దేశాన్ని కాపాడతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) అన్నారు. . దేశాన్ని కాపాడటానికి గత 7 సంవత్సరాలుగా ప్రయత్నిస్తు న్నానని తెలిపారు. మంగళవారం నాడు కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ...ఎస్. కోట ఎమ్మెల్యే గా, విశాఖ ఎంపీగా తాను పోటీ చేస్తానని ప్రకటించారు.
Andhrapradesh: జనసేన అధినేత పవన్ రూ.500 కోట్లు తీసుకొని 21 సీట్లకి సరెండర్ అయ్యారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 2014లో మోదీ మోసం చేశారని..ఇప్పుడు మోదీ మాట్లాడుతుంటే పవన్ చప్పట్లు కొడుతున్నారని మండిపడ్డారు. బుర్రలేని దద్దమ్మలు వైసీపీలో, టీడీపీలో చేరుతున్నారన్నారు. రాష్టాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఒక కుటుంబంలో ఉన్నవారు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే ఇతరులకు అవకాశం ఇవ్వరా అని ప్రశ్నించారు.
ఏపీలో ఎన్నికలను ఏప్రిల్లో నిర్వహించి మేలో ఫలితాలిస్తుడటంతో ఈవీఎంలు మిస్ అవుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA PAUL) అన్నారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల అధికారిని కలిశానని.. ఎలక్షన్ను ఏప్రిల్లో నిర్వహించవద్దని కోరానని తెలిపారు. ఏపీకి ముగ్గురు ఎన్నికల కమిషనర్లను నియమించాలని కోరారు.
మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ హల్చల్ చేశారు. హైకోర్ట్లో పబ్లిక్ రైటికేషన్ పిల్ వేశానని, దాని మీద రేపు (మంగళవారం) విచారణ జరుగుతుందని అన్నారు. ‘‘ ఎలక్షన్ నిర్వహించడం కోసం ముగ్గురు కమిషనర్స్ ఉండాలి కానీ ఒక్కరే ఉన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎన్నికలు జరపకూడదు’’ అని అన్నారు.
ఏపీ సచివాలయంలోని ఐదో బ్లాక్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) గురువారం నాడు నిరసనకు దిగారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసేందుకు సచివాలయానికి కేఏ పాల్ వచ్చారు. అనుమతి లేదంటూ సెక్రటేరియట్ మెయిన్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత లోపలికి అనుమతించలేదు.