Share News

KA Paul: లోకల్ బ్రాండ్ కావాలా.. అమెరికన్ బ్రాండ్ కావాలా?

ABN , Publish Date - May 09 , 2024 | 09:03 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన వినూత్న ప్రచార కార్యక్రమాలతో కొన్నిరోజుల పాటు వార్తల్లో నానిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఇప్పుడు ఏపీ ఎన్నికల టైంలోనూ..

KA Paul: లోకల్ బ్రాండ్ కావాలా.. అమెరికన్ బ్రాండ్ కావాలా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) సమయంలో తన వినూత్న ప్రచార కార్యక్రమాలతో కొన్నిరోజుల పాటు వార్తల్లో నానిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul).. ఇప్పుడు ఏపీ ఎన్నికల (AP Elections 2024) టైంలోనూ అదే పంథాని కొనసాగిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు గాను రోడ్డుపైకి వచ్చి.. అనూహ్యంగా ప్రచారం చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన.. ఓ ప్రభుత్వ మద్యం షాపు వద్దకు వెళ్లి, మద్యం బాటిల్ కొనుగోలు చేసి తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మందు తాగుతున్న మద్యంప్రియులు కూడా మద్యపానాన్ని నిషేధించాలని కోరుతున్నారని పేర్కొన్నారు.


చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్.. టీ20 క్రికెట్‌లో ఆల్‌టైం రికార్డ్

మద్యపానాన్ని నిషేధిస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్ (YS Jagan).. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని కేఏ పాల్ మండిపడ్డారు. నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో సీఎం జగన్ చెలగాటం ఆడుతున్నారని ఆరోపించిన ఆయన.. మీకు అమెరికన్ బ్రాండ్ కావాలా? లోకల్ బ్రాండ్ కావాలా? అని ప్రజల్ని ఉద్దేశించి ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని అమ్మింది కూడా జగనే అని, కానీ అమ్మలేదంటూ అబద్ధాలు చెప్తున్నారని విరుచుకుపడ్డారు. గత ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలు చేయలేదని, నూటికినూరు పాళ్లు మాట తప్పారని ఉద్ఘాటించారు. ఇలాంటి వారిని ఎన్నికల్లో ఓడించి.. తనని గెలిపించాలని కేఏ పాల్ ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 09 , 2024 | 09:03 PM