Share News

AP Elections: పార్లమెంట్‌లో అడుగు పెడితే..

ABN , Publish Date - Apr 28 , 2024 | 08:21 PM

ఎంపీగా గెలిచి... పార్లమెంట్‌లో తాను అడుగు పెడితే విశాఖపట్నం నగరాభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ స్పష్టం చేశారు. ఆదివారం విశాఖపట్నంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు.. తనను ఎంపీగా కోరుకుంటున్నారన్నారు.

AP Elections: పార్లమెంట్‌లో అడుగు పెడితే..

విశాఖపట్నం, ఏప్రిల్ 27: ఎంపీగా గెలిచి... పార్లమెంట్‌లో తాను అడుగు పెడితే విశాఖపట్నం నగరాభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ స్పష్టం చేశారు. ఆదివారం విశాఖపట్నంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు.. తనను ఎంపీగా కోరుకుంటున్నారన్నారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని అన్ని పార్టీల అభ్యర్థులకు కేఏ పాల్ సూచించారు. లేకుంటే వారికి ప్రజలే బుద్ది చెబుతారన్నారు. లోక్‌సభ అభ్యర్థిగా తాను ఏకగ్రీవంగా ఎన్నికొనేందుకు ఎన్నికల బరిలో నిలిచిన వారంతా సహకరించాలని విజ్జప్తి చేశారు.


గాజువాక ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా తనను గెలిపిస్తే.. విశాఖపట్నం నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తానని ఈ సందర్బంగా కేఏ పాల్ ప్రజలకు హామీ ఇచ్చారు. బొత్స ఝాన్సీ రెండు సార్లు ఎంపీగా గెలిచినా.. ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని కుండబద్దలు కొట్టారు. ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా తానే అపానని ఈ సందర్బంగా కేఏ పాల్ పేర్కొన్నారు.

ప్రజా శాంతి పార్టీ ఎంపీ అభ్యర్థిగా కేఏ పాల్ విశాఖపట్నం నుంచి బరిలో దిగారు. అలాగే అదే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజువాక నుంచి సైతం ఆయన పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.


అయితే విశాఖపట్నం ఎంపీగా గెలుపు ఎవరిని వరిస్తుందనే అంశం ఆసక్తిని రేకేతిస్తోంది. ఇప్పటికే విశాఖపట్నం కూటమి అభ్యర్థిగా టీడీపీ నాయకుడు ఎం భరత్ బరిలో నిలిచారు. అలాగే వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీని రంగంలోకి దింపారు. అయితే గెలుపు అవకాశాలు కూటమి అభ్యర్థి భరత్‌కే ఉన్నాయనే ఓ చర్చ సైతం రాజకీయ వర్గాల్లో సాగుతుంది.

Read National News and Telugu News

Updated Date - Apr 28 , 2024 | 08:23 PM