KA Paul: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నా వల్లే ఆగింది.. కేఏ పాల్ సంచలనం..!!
ABN , Publish Date - Apr 26 , 2024 | 05:22 PM
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తన వల్లే ఆగిపోయిందని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో తన సత్తా ఏంటో సీఎం జగన్, ప్రధాని మోదీకి తెలిసిందని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయర్ లేకుండా వాదించానని గుర్తుచేశారు. ఆర్డర్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేశానని కేఏ పాల్ స్పష్టం చేశారు.
విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తన వల్లే ఆగిపోయిందని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో తన సత్తా ఏంటో సీఎం జగన్, ప్రధాని మోదీకి తెలిసిందని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయర్ లేకుండా వాదించానని గుర్తుచేశారు. ఆర్డర్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేశానని కేఏ పాల్ స్పష్టం చేశారు.
అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ తీరుపై కేఏ పాల్ మండిపడ్డారు. విశాఖ ఎంపీ భరత్ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేక పోయారని వివరించారు. భరత్ లక్ష కోట్ల డ్రగ్ కేసుల్లో ఇరుకున్నారని కేఏ పాల్ ఆరోపించారు. పనిలో పనిగా బొత్స ఝాన్సీపై విమర్శలు గుప్పించారు. ఆమె కూర్చొంటే లేవలేదు.. లేస్తే నడవలేదని మండిపడ్డారు. ఇంకేం డెవలప్ చేస్తుందని అడిగారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్డర్ తాను తీసుకొచ్చానని కేఏ పాల్ మరోసారి గుర్తుచేశారు. అయితే క్రెడిట్ మరొకరికి ఇస్తున్నారని మండిపడ్డారు. తనకు క్రెడిట్ దక్కకపోవడానికి కారణం మీ కులంలో పుట్టకపోవడమేనా..? అని అడిగారు. తనను విశాఖ ఎంపీగా గెలిపించాలని కేఏ పాల్ కోరారు. లేదంటే స్టీల్ ప్లాంట్ భూములను అమ్ముకుంటారని మండిపడ్డారు. విశాఖ బరిలో తాను నిలవడంతో తన పార్టీ గుర్తు రద్దుచేశారని వివరించారు. హెలికాప్టర్ గుర్తు స్థానంలో కుండ తీసుకొచ్చారని వివరించారు.
ఇది కూడా చదవండి...
AP Elections: ఎన్నికల బరి నుంచి కొడాలి నాని ఔట్..!
Read Latest AP News And Telugu News