Home » KADAPA
ఉల్లిపాయలు కోస్తేనే కాదు.. వాటిని కొనాలన్నా కన్నీళ్లు వచ్చే పరిస్థితి నెలకొంది. ఉల్లి ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. పెరుగుతున్న ఉల్లి ఽధరలు చూసి సామాన్య మధ్యతరగతి ప్రజానీకం బెంబేలెత్తుతున్నారు.
గత వైసీపీ పాలనలో అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇష్టానుసారంగా ప్రాజెక్టును మంజూరు చేసి రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములను లాక్కుని రిజర్వాయర్ నిర్మాణ పనులను ఆగమేఘాలపై ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతులను పోలీసులు, రెవెన్యూ అధికారులతో రకరకాలుగా బెదిరింపు చర్యలకు పాల్పడి లాక్కున్నారు.
రిమ్స్ ప్రాంగణంలో గల ఇనిస్టిట్యుట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కడప వారి ఆధ్వర్యంలో ఈనెల 10న ప్రపంచ మానసిక వారోత్సవాలు నిర్వ హించ నున్నారు.
ప్రతి పారిశుధ్య కార్మికుడు యూనిఫాం తప్పనిసరిగా ధరించాలని ఇనచార్జ్ కమిషనరు రాకేశచంద్రన తెలిపారు.
తన తండ్రిని విచారణ పేరుతో టూటౌన పోలీసులు వేధిస్తున్నారని కడప శంకరాపురానికి చెందిన గంజికుంట సురేశకుమార్రెడ్డి సోమవారం ఎస్పీ హర్షవర్ధన రాజుకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు.
మండలంలోని వెల్లటూరు గ్రా మంలో ఉన్న మద్యం దుకాణంలో చోరీ జరిగింది. రూ.5.09 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు.
మండలంలోని యల్లటూరు రాజీవ్‌నగర్‌కు చెందిన పార్ల పుల్లారెడ్డి (57) అనే రైతు సోమవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
రాష్ట్రప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు దసరా కానుకగా 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాసుందర్‌రెడ్డి అన్నారు.
మండల కేంద్రమైన వేములలోని కళాశాలల వద్ద బస్‌షెల్టర్ నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు.
ప్రతి రైతు తమ తోటలలో ఫారంపాండ్లను ఏర్పాటు చేసుకోవాలని పీఆర్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్ స్టేట్ జాయింట్ కమిషనర్ శివప్రసాద్ సూచించారు.