Home » Kaleshwaram Project
కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచిన వారికే క్యాబినెట్ మంత్రి పదవులు దక్కుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ ఒకేసారి ఉంటాయని, వాటిపై చర్చలు జరుగుతున్నాయని, ఆ రెండు అంశాలకు సంబంధించి పేర్లతో కూడిన జాబితాను అధిష్ఠానానికి అందించామని చెప్పారు.
ముఖ్యమంత్రులుగా ఓ వెలుగు వెలిగారు. అది కూడా వంద వాట్స్ బల్బులాగా కాంతులీనారు. మేము మోనార్కులమన్నట్లుగా వ్యవహరించారు. ఇంకా చెప్పాలంటే.. ప్రజాస్యామ్యదేశంలో ప్రజలు తమకు ఈ హోదా కట్టబెట్టారన్నట్లుగా కాకుండా.. తాము దైవాంశ సంభుతులమని.. తమ జాతకంలో గజకేసర యోగం కదంతొక్కుతుందని.. అందుకే తమకు ఈ యోగం.. ఈ మహారాజ యోగం దక్కిందన్నట్లుగా మసులుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు కరెంటు కొనుగోలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ల గడువు రెండు రోజుల్లో ముగియనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నిర్మాణ లోపాలు, అవినీతిపై ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ వేసింది.
మేడిగడ్డ ప్రాజెక్టు డిజైన్ ఒకటైతే నిర్మాణం మరోరకంగా చేశారని, అందుకే అది కుంగిందని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లేదని, నిర్వహణ కూడా సరిగా లేదని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ అధికారుల్లో మరోమారు గుబులు మొదలైంది. ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు ఇరిగేషన్ అధికారులు అఫిడవిట్ సమర్పించినట్లు తెలిసింది.
మాజీ సీఎం కేసీఆర్పై (KCR) టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) షాకింగ్ కామెంట్స్ చేశారు. మేడిగడ్డ డిజైన్ ఒకటైతే.. నిర్మాణం మరొక రకంగా చేయడంతో కుంగిపోయిందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ మెటిరీయల్ సక్రమంగా లేదు, నిర్వహణ కూడా లేదని డ్యాంసేప్టీ అధికారులు చెప్పారని గుర్తుచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరైన వారికి అఫిడవిట్ల దాఖలుకు ఇచ్చిన గడువు ఈ నెల 27వ తేదీతో ముగియనుంది.
మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకులో చేపట్టిన తాత్కాలిక మరమ్మతు పనులు చివరి దశకు చేరుకున్నాయి. గ్రౌటింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకోగా షీట్ పైల్స్ అమరిక పనులు పూర్తికావస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేపట్టిన తొందరపాటు చర్యలేబ్యారేజీలను దెబ్బతీశాయా? అవసరమైన సర్వేలు నిర్వహించి, నిర్ధారిత ప్రమాణాలను జాగ్రత్తగా పాటిస్తూ పదేళ్ల సమయంలో నిర్మించాల్సిన ప్రాజెక్టును కేవలం మూడేళ్ల వ్యవధిలోనే హడావుడిగా పూర్తి చేయడమే బ్యారేజీల కుంగుబాటుకు కారణమా?
‘కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ(Telangana) అభివృద్ధిని చావు దెబ్బతీసింది. సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు జుడీషియల్ కమిషన్కు ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టుపై సమగ్ర న్యాయవిచారణ జరిపించాలి. తప్పుల తడక డిజైన్లకు ఎలా అనుమతిచ్చారు. ఇరిగేషన్ అంటేనే మాఫియాగా మారింది’ అని పలువురు వక్తలు ఆరోపించారు.