Share News

Kodandaram: ఆ కేసులు ఎత్తివేయాలని కేసీఆర్ కోరడం బాధ్యతారాహిత్యమే..

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:04 PM

మాజీ సీఎం కేసీఆర్‌పై (KCR) టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) షాకింగ్ కామెంట్స్ చేశారు. మేడిగడ్డ డిజైన్ ఒకటైతే.. నిర్మాణం మరొక రకంగా చేయడంతో కుంగిపోయిందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ మెటిరీయల్ సక్రమంగా లేదు, నిర్వహణ కూడా లేదని డ్యాంసేప్టీ అధికారులు చెప్పారని గుర్తుచేశారు.

Kodandaram: ఆ కేసులు ఎత్తివేయాలని  కేసీఆర్ కోరడం బాధ్యతారాహిత్యమే..
Kodandaram

హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్‌పై (KCR) టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) షాకింగ్ కామెంట్స్ చేశారు. తనపైన ఉన్న కేసులు ఎత్తివేయాలని కేసీఆర్ కోరడం బాధ్యతారాహిత్యమేనని అన్నారు. మేడిగడ్డ డిజైన్ ఒకటైతే.. నిర్మాణం మరొక రకంగా చేయడంతో కుంగిపోయిందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ మెటిరీయల్ సక్రమంగా లేదు, నిర్వహణ కూడా లేదని డ్యాం సేప్టీ అధికారులు చెప్పారని గుర్తుచేశారు. ఈరోజు(బుధవారం) తన కార్యాలయంలో కోదండరాం మీడియాతో మాట్లాడారు. తుమ్మిడిహట్టిని పరిశీలించాలని ప్రభుత్వం, కమిషన్‌ను కోరామన్నారు.


ఇంజనీర్ సూచనలను గత ప్రభుత్వం బేఖాతరు చేసిందని మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్టు అవినీతి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని హెచ్చరించారు. కమిషన్ వేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని అసెంబ్లీలో బీఆర్ఎస్ కోరిందని చెప్పారు. విచారణ కమిటీని రద్దు చేయించి.. వాస్తవాలు బయటకు రాకుండా ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బొగ్గు గనులను వేలం వేయడమంటే ప్రైవేటీకరణకు దారి తీయడమేనని చెప్పారు. బొగ్గు గనులను సింగరేణికే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని కోదండరాం పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Deputy CM Bhatti: రీజనల్ రింగ్ రోడ్డుపై కేంద్రమంత్రితో సీఎం, మంత్రుల చర్చ

Jagadish Reddy: సీఎం రేవంత్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నా రు.. జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 26 , 2024 | 05:07 PM