Home » Kaleshwaram Project
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీను నిపుణుల కమిటీ సందర్శించనుంది. నిర్మాణపరంగా, నాణ్యత పరంగా, నిర్వహణ పరంగా లోపాలను వెలికితీయడంతో పాటు వాటికి బాధ్యులను గుర్తించేందుకు నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్కు సాంకేతిక అంశాల్లో సాయం కోసం వేసిన ఈ కమిటీ శనివారం ఆయా బ్యారేజీలను సందర్శించనుంది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram project) జస్టిస్ పినాకి చంద్రఘోష్ (Chandraghosh) నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ న్యాయవిచారణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే జూన్ 6వ తేదీకి కాలేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర గోష్ హైదరాబాద్ వస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్-7లో తాత్కాలిక మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఇసుక గ్రౌటింగ్ కోసం డ్రిల్లింగ్ పనులు నడుస్తుండగా.. దిగువన షీట్ పైల్స్ అమరిక, సీసీ బ్లాకుల రీ అరెంజ్మెంట్ పనులు కొనసాగుతున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్-7లో చేపట్టిన తాత్కాలిక మరమ్మతు పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఆర్క్ గ్రౌగింగ్ పద్ధతిలో 20వ నెంబరు గేటు తొలగింపు పనులు నిర్వహిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) వ్యవహారంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్(BJP MP Laxman) సంచలన కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు బయట పడుతున్నాయని.. ఈ వ్యవహారంపై రేవంత్ సర్కార్(CM Revanth Reddy) ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న బ్లాక్-7 కింద అగాధాన్ని పూడ్చేందుకు గ్రౌటింగ్ పనుల ప్రారంభానికి మరోరోజు సమయం పట్టనుంది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ఏ విధంగా ఉందో గుర్తించేందుకుగాను భూ భౌతిక (జియో ఫిజికల్), భూ సాంకేతిక (జియో టెక్నికల్) పరీక్షలు చేయడానికి ఈ నెల 29వ తేదీన ఢిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక, ఇతర భూపదార్థాల పరిశోధన కేంద్రం (సీఎ్సఎంఆర్ఎస్) నిపుణుల బృందం రానుంది.
మేడిగడ్డ బ్యారేజీలో కుంగుబాటుకు గురైన బ్లాక్-7కు దిగువన షీట్ఫైల్స్ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం బ్లాక్-7కు దిగువన ఉన్న ఒక వరుస సీసీ బ్లాక్లను తొలగించడంతో పాటు వరద ఉధృతికి చెల్లాచెదురైన సీసీ బ్లాక్లను తిరిగి అమరుస్తున్నారు.
మేడిగడ్డ ప్రాజెక్టు ఏడో బ్లాక్ పునాదుల కింద అగాధం ఏర్పడిన నేపథ్యంలో వాటిని పూడ్చి పునాదులను పటిష్టం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్షాలు పడి, మేడిగడ్డ వద్ద ప్రవాహం మొదలు కావడానికి కేవలం 2వారాల సమయం మాత్రమే ఉంది.
మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాకు పిల్లర్ నెం.20 వద్ద బ్యారేజీ లోపలి భాగంలో నలుగురు మనుషులు పట్టేంత పెద్ద గొయ్యి పడింది. ఇది మేడిగడ్డ కింద ఏర్పడిన అగాధంలో భాగమని భావిస్తున్నారు. గురువారం సాయంత్రం 16వ నంబరు గేటు ఎత్తే ప్రయత్నంలో భారీ శబ్దాలు వచ్చిన తర్వాత బ్యారేజీలో జలాశయం వైపు ఇసుక కుంగి, ఈ గొయ్యి కనిపించింది.