TG News: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను ముమ్మరం చేసిన చంద్రఘోష్ కమిటీ
ABN , Publish Date - May 31 , 2024 | 09:58 PM
కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram project) జస్టిస్ పినాకి చంద్రఘోష్ (Chandraghosh) నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ న్యాయవిచారణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే జూన్ 6వ తేదీకి కాలేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర గోష్ హైదరాబాద్ వస్తున్నారు.
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram project) జస్టిస్ పినాకి చంద్రఘోష్ (Chandraghosh) నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ న్యాయవిచారణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే జూన్ 6వ తేదీకి కాలేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర గోష్ హైదరాబాద్ వస్తున్నారు. ఇప్పటి వరకు అందిన రిపోర్టులు, వచ్చిన ఫిర్యాదులను చంద్ర గోష్ మొదటగా పరిశీలించనున్నారు. రెండో వారంలో పలువురికి జస్టిస్ సమన్లు జారీ చేయనన్నారు. కాలేశ్వరంలో పనిచేసిన ఈఎన్సీలు, ఇంజనీర్లను, మాజీ అధికారులను చంద్రబోస్ విచారణకు పిలవనున్నారు. ఫిర్యాదులు చేసిన వాళ్లను కూడా పిలిచి విచారణ చంద్ర గోష్ చేయనున్నారు.
కొనసాగుతున్న బ్యారేజీల పనులు
కాగా.. కాళేశ్వరంలో మూడు బ్యారేజీల పనులు కొనసాగుతున్నాయి. మూడు బ్యారేజీల్లో కలిపి మొత్తం 57 సీకెండ్ పనులను ప్రభుత్వం చేస్తోంది. మేడిగడ్డలో ప్రస్తుతం 7 టెస్టులు, పనులు సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. జూన్ 30వ తేదీ లోపు టెస్టులు ఇతర పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. మేజర్‌గా షీట్ ఫైల్, క్రాక్స్ ఫిల్, సాండ్ క్రౌటింగ్, గేట్లు ఎత్తాలనేది ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్నది. మేడిగడ్డలో బ్లాక్ 7కి మాత్రమే ప్రభుత్వం కాపర్ డ్యాం నిర్మిస్తున్నది. మూడు బ్యారేజీలకు కలిపి దాదాపుగా రూ. 500 కోట్లు ఖర్చు అవుతుందని సర్కార్ అంచనా వేస్తున్నది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..
చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు టీడీపీ ట్రైనింగ్..
ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..
రాష్ట్ర చిహ్నం.. తాత్కాలికంగా నిలిపివేత..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News