Share News

Kaleshwaram Paroject: ‘మేడిగడ్డ’ ఎగువన అప్రోచ్‌ రోడ్డు విస్తరణ!

ABN , Publish Date - May 30 , 2024 | 05:59 AM

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్‌-7లో చేపట్టిన తాత్కాలిక మరమ్మతు పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఆర్క్‌ గ్రౌగింగ్‌ పద్ధతిలో 20వ నెంబరు గేటు తొలగింపు పనులు నిర్వహిస్తున్నారు.

Kaleshwaram Paroject: ‘మేడిగడ్డ’ ఎగువన అప్రోచ్‌ రోడ్డు విస్తరణ!

  • భారీ వాహనాల రాకపోకలకు వీలుగా మట్టి రోడ్లు

  • శరవేగంగా గేట్ల కటింగ్‌, షీట్‌ఫైల్స్‌ ఏర్పాటు

మహదేవపూర్‌ రూరల్‌, మే 29 : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్‌-7లో చేపట్టిన తాత్కాలిక మరమ్మతు పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఆర్క్‌ గ్రౌగింగ్‌ పద్ధతిలో 20వ నెంబరు గేటు తొలగింపు పనులు నిర్వహిస్తున్నారు. ఆ పనులు పూర్తవ్వగానే కట్‌ చేసిన గేట్లు, వాటి విడిభాగాలను వేరే ప్రాంతానికి తరలిస్తారు. ఇందుకోసం బ్యారేజీ బ్లాక్‌-7 ఎగువ వైపు నుంచి మహారాష్ట్ర వైపు వెళ్లేందుకు గతంలో ఉన్న అప్రోచ్‌ రోడ్డును విస్తరిస్తున్నారు. భారీ వాహనాలు వెళ్లేందుకు వీలుగా రహదారిని నిర్మిస్తున్నారు. పిల్లర్ల కింద అగాఽధాన్ని పూడ్చేందుకు చేపట్టాల్సిన ఇసుక గ్రౌటింగ్‌ ప్రక్రియ మినహాగేట్ల ముందున్న బే ప్రాంతంలో డ్రిల్లింగ్‌, గేట్ల కటింగ్‌, షీట్‌ఫైల్స్‌ ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. గ్రౌటింగ్‌ కోసం గేట్ల బే ప్రాంతంలో డ్రిల్లింగ్‌ పనులు జరుగుతుండగా బుధవారం నాటికి రెండు గేట్ల బేప్రాంతాల్లో డ్రిల్లింగ్‌ పూర్తయినట్టు తెలిసింది. 3 బే ప్రాంతాల్లో గురువారం నాటికి డ్రిల్లింగ్‌ పూర్తి కానుందని, ఆ వెంటనే ఇసుక గ్రౌటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఓ అధికారి వివరించారు.

Updated Date - May 30 , 2024 | 05:59 AM