Share News

Medigadda Barrage: రేపు మేడిగడ్డకు నిపుణుల కమిటీ...

ABN , Publish Date - Jun 01 , 2024 | 05:48 AM

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీను నిపుణుల కమిటీ సందర్శించనుంది. నిర్మాణపరంగా, నాణ్యత పరంగా, నిర్వహణ పరంగా లోపాలను వెలికితీయడంతో పాటు వాటికి బాధ్యులను గుర్తించేందుకు నియమించిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌కు సాంకేతిక అంశాల్లో సాయం కోసం వేసిన ఈ కమిటీ శనివారం ఆయా బ్యారేజీలను సందర్శించనుంది.

Medigadda Barrage: రేపు మేడిగడ్డకు నిపుణుల కమిటీ...

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీను నిపుణుల కమిటీ సందర్శించనుంది. నిర్మాణపరంగా, నాణ్యత పరంగా, నిర్వహణ పరంగా లోపాలను వెలికితీయడంతో పాటు వాటికి బాధ్యులను గుర్తించేందుకు నియమించిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌కు సాంకేతిక అంశాల్లో సాయం కోసం వేసిన ఈ కమిటీ శనివారం ఆయా బ్యారేజీలను సందర్శించనుంది. సివిల్‌ స్ట్రక్చరల్‌ అంశాల కోసం ఎన్‌ఐటీ వరంగల్‌ పూర్వ ప్రొఫెసర్‌ సి.బి.కామేశ్వరరావు, మెకానికల్‌ రంగంపై డ్యామ్‌ సేఫ్టీ రిప్యూ ప్యానల్‌ నిపుణుడు మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ కె.సత్యనారాయణ, జియో టెక్నికల్‌ అంశాలపై ఎన్‌ఐటీ వరంగల్‌ ప్రొఫెసర్‌ కె.రమణమూర్తి తదితరులతో కమిటీ వేయగా ఆ కమిటీ బ్యారేజీలను తనిఖీ చేయనుంది.


జూన్‌ 7, 8 తేదీల్లో కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ ఆయా బ్యారేజీలను పరిశీలించనున్నారనే నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న మరమ్మతులను కమిటీ పరిశీలించనుంది. ఇక మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఏ విధంగా ఉన్నాయో కేంద్ర సంస్థలతో భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు చేయించాలని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక ఇచ్చిన విషయం విదితమే. పుణేలోని కేంద్ర నీటి, విద్యుత్‌ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌), ఢిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక, ఇతర భూపదార్థాల పరిశోధన కేంద్రం(సీఎ్‌సఎంఆర్‌ఎ్‌స)తో, హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఏ)తో అధ్యయనం చేయించాలని ఎన్‌డీఎ్‌సఏ సిఫారసుచేయగా... ఒక్క సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ మాత్రమే స్పందించి, నిపుణులను పంపించి, ఒక్కో బ్యారేజీ పరీక్షకు రూ.కోటి చొప్పున 3 కోట్లు అవుతాయని అంచనాలు సమర్పించింది.

Updated Date - Jun 01 , 2024 | 05:48 AM