Home » Kaleshwaram Project
మళ్లీ తెలంగాణను ఎడారిగా మార్చే కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టడానికే... ఈ ‘చలో మేడిగడ్డ’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. చిన్న లోపాన్ని.. పెద్ద భూతద్దంలో చూపిస్తూ.. బాధ్యత మరిచిన కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసేందుకే... ఈ ‘చలో మేడిగడ్డ’ అని తెలిపారు. ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టును పరిరక్షించకుండా.. కూలిపోవాలని చూస్తున్న కాంగ్రెస్ కుతంత్రాన్ని ప్రజల సాక్షిగా నిలదీయడానికే.. ఈ ‘చలో మేడిగడ్డ’ అని కేటీఆర్ అన్నారు.
కథలు చెప్పడానికే బీఆర్ఎస్(BRS) నేతలు కాళేశ్వరం వెళ్తున్నారని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి(Mallu Ravi) అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయిందని గతంలో కేంద్ర ప్రభుత్వం పంపించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు ఓ నివేదిక ఇచ్చారని తెలిపారు.
Telangana: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్షకోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని.. ఎక్కడ అవినీతి జరిగిందో ఆధారాలు చూపించాలని మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉపయోగం ఏంటో రేపు (శుక్రవారం) చూపిస్తామన్నారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదన్నారు.
Telangana: కాళేశ్వరంపై వచ్చిన విమర్శలకు సమాధానంగా బీఆర్ఎస్ చేపట్టిన మేడిగడ్డ పర్యటనకు కౌంటర్‌గా కాంగ్రెస్ మరో పర్యటనకు సిద్ధమైంది. పాలమూరు - రంగారెడ్డి పర్యటనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. రేపు (శుక్రవారం) పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటనకు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు.
BRS Calls Chalo Medigadda: కాళేశ్వరం ప్రాజెక్టును(Kaleshwaram Lift Irrigation Project) కూల్చే కుట్ర చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై(Congress) నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). ఇందులో భాగంగా ‘ఛలో మేడిగడ్డ’కు పిలుపునిచ్చారు కేటీఆర్. మంగళవారం నాడు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
గురుకుల విద్యార్థుల ఆత్మహత్యల ఘటనపై బీఆర్ఎస్ లీడర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. రేవంత్ ప్రభుత్వం కారణంగానే గడిచిన 15 రోజుల్లో నలుగురు గురుకుల విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ఎందుకు సీబీఐ విచారణ జరిపించలేదని ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి (Mallu Ravi) ప్రశ్నించారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాగ్ రిపోర్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్‌ను సిద్ధం చేసింది. డీపీఆర్‌లో రూ.63,352 కోట్లు చూపెట్టగా రూ.1,06,000 కోట్లకు అంచనా వ్యయం పెంచారని.. ప్రస్తుత నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉందని కాగ్ తన నివేదికలో పేర్కొంది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో విచారణ జరిపిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు.
బీజేపీ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు వెళ్లకపోవడాన్ని ఆ పార్టీ నేత రవీంద్ర నాయక్ ( Ravindra Naik) తప్పు పట్టారు.