Home » Kaleshwaram Project
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై సీబీఐ అధికారులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్లో కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
మేడిగడ్డ అంశంలో ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు విజిలెన్స్ తేల్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwara Project)లో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగుబాటుపై విచారణ చేపట్టేందుకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ రంగంలోకి దిగారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఒక రూపాయి ఖర్చు చేస్తే.. నికరంగా దాని నుంచి వచ్చే ఆదాయం 52 పైసలు మాత్రమేనని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్పష్టం చేసింది. అందువల్ల, ఈ ప్రాజెక్టు ఆర్థికంగా అంత ప్రయోజనకరం కాదని తేల్చి చెప్పింది.
కాళేశ్వరం ( Kaleswaram ) మొత్తం ప్రాజెక్ట్‌పైన విచారణ కోసం హైకోర్టు చీఫ్ జడ్జికి లేఖ రాశామని.. సిట్టింగ్ జడ్జి విచారణ జరుపుతారని నీటి పారుదల, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) తెలిపారు.
మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) ప్రకటించారు. మంగళవారం నాడు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న పది నీటి పారుదల కార్యాలయాలల్లో విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ చెప్పారు.
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలు బయటపెతామని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విచారణ చేపట్టిస్తామని గతంలో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్న మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) స్క్రిప్ట్‌ను బీజేపీ ( BJP ) నేతలు చదివారని మంత్రి పొన్నం ప్రభాకర్ ( Minister Ponnam Prabhakar ) ఎద్దేవా చేశారు. మంగళవారం నాడు సచివాలయం మీడియా పాయింట్లో మంత్రి ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ... ప్రజా పాలన దరఖాస్తులు జనవరి 6వ తేదీనే చివరి రోజని.. మళ్లీ గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరుగుతుందని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసునని చెప్పారు. కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ( Kaleshwaram project )పై ఈ వారంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) తెలిపారు. మంగళవారం నాడు సెక్రటేరియట్ మీడియా సెంటర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్, బీజేపీ కలిసి అవినీతికి పాల్పడ్డాయన్నారు. కాళేశ్వరంపై పదేళ్ల నుంచి సీబీఐ విచారణ ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం డ్యామేజ్ రిపేర్ చేసే బాధ్యత ఏజెన్సీదేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ ప్రజలను పట్టిపిడిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.