Share News

Kaleshwaram: చిన్న కాళేశ్వరం.. పెద్ద అడుగు!

ABN , Publish Date - Apr 06 , 2025 | 04:42 AM

గోదావరిపై ప్రతిపాదించిన చిన్న కాళేశ్వరం పనుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. పదిహేనేళ్ల క్రితం భూపాలపల్లి జిల్లాలో అప్పటి వైఎస్‌ సర్కార్‌ శంకుస్థాపన చేసిన కాళేశ్వర ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐఎ్‌స-చిన్న కాళేశ్వరం) ప్రాజెక్టు నిర్మాణం పనులు నిధుల కొరతతో నిలిచిపోయాయి.

Kaleshwaram: చిన్న కాళేశ్వరం.. పెద్ద అడుగు!

కాళేశ్వర ముక్తేశ్వర ఎత్తిపోతల పథకంలో కదలిక.. ప్రాజెక్టు కోసం తన వాటా నిధలిచ్చేందుకు కేంద్రం ఓకే

  • భూసేకరణ కోసం ముమ్మరంగా గ్రామసభల నిర్వహణ

  • కాల్వ నిర్మాణం జరిగితే 45వేల ఎకరాలకు సాగునీరు

భూపాలపల్లి, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): గోదావరిపై ప్రతిపాదించిన చిన్న కాళేశ్వరం పనుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. పదిహేనేళ్ల క్రితం భూపాలపల్లి జిల్లాలో అప్పటి వైఎస్‌ సర్కార్‌ శంకుస్థాపన చేసిన కాళేశ్వర ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐఎ్‌స-చిన్న కాళేశ్వరం) ప్రాజెక్టు నిర్మాణం పనులు నిధుల కొరతతో నిలిచిపోయాయి. తాజాగా ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత ్వం తన వాటాగా నిధులను ఇవ్వడానికి అంగీకరించడంతో రాష్ట్రప్రభుత్వం చిన్న ప్రాజెక్టు పనులను పూర్తి చేయించి, ఆయకట్టు రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నిన్న మొన్నటిదాకా భూసేకరణ అడ్డంకిగా మారగా మంత్రులు ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు ఆ సమస్య పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించారు. ఫలితంగా ప్రాజెక్టు పరిధిలోని కాటారం, మల్హర్‌ మండలాల పరిధిలో భూసేకరణ కోసం ముమ్మరంగా గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రిజర్వాయర్‌ పనులు, పంప్‌హౌస్‌ మోటార్ల బిగింపు ప్రక్రియ పూర్తరుంది. ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్‌ సబ్‌ డిస్ట్రిబ్యూటరీల తవ్వకాలకు అవసరమైన భూసేకరణ పూర్తయితే రైతాంగానికి సాగునీరు అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా గోదావరి, మానేరు పరీవాహక ప్రాంతాల మధ్యలో ఉన్న కాటారం, మల్హర్‌, మహాదేవపూర్‌, మహాముత్తారం మండలాలకు చెందిన 63గ్రామాల రైతులకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.


చిన్నకాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా కాటారం, మహాదేవపూర్‌, మహాముత్తారం, మల్హర్‌ మండలాల్లోని 45,232 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రతిపాదించారు. ఇందుకుగాను 14చెరువులను పునరుద్ధరించి రిజర్వాయర్లుగా మార్చాలని సంకల్పించారు. వీటికి అదనంగా మరో మూడు చెరువులనూ కలపాలని మంత్రి అధికారులకు సూచించడంతో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు రివైజ్‌ చేసి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది. కాగా, ఇప్పటికే గారెపల్లి సమీపంలో నూతన రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. మహాదేవపూర్‌ మండలంలోని ఎర్రచెరువు, మందిరం చెరువు, కాటారం మండలంలోని కొత్తపల్లి, కొత్తపల్లి తండా, గారెపల్లి చింతల చెరువు, ఆదివారంపేట, ధన్వాడ, గుమ్మళ్లపల్లి, గూడూర్‌ ఊర చెరువులు, వీరాపూర్‌ శివశంకర్‌ ప్రాజెక్ట్‌, మల్హర్‌ మండలంలోని రుద్రారం, మహాముత్తారం మండలంలోని పోలారం, ఎల్లాపూర్‌ చెరువులను రిజర్వాయర్లుగా మార్చడానికి ప్రతిపాదించి పనులను చేపట్టారు. గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా రెండు దశల్లో సరఫరా చేయడానికి పథకం రూపకల్పన చేయగా, మొత్తం 4.5 టీఎంసీ ల నీటిని పంప్‌హౌజ్‌ల ద్వారా చెరువుల్లోకి మళ్లించి ఆయకట్టుకు నీరందించేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు కాళేశ్వరం సమీపంలోని బీరసాగర్‌ వద్ద స్టేజ్‌-1 పంప్‌హౌజ్‌, కాటారం సమీపంలో స్టేజ్‌-2 పంప్‌హౌజ్‌ నిర్మాణాలు జరిగాయి. ఇందులో మొత్తం 27 మెగావాట్ల సామర్థ్యం గల పంపులను కూడా బిగించారు.


భూసేకరణకు యత్నాలు

చిన్నకాళేశ్వరం ప్రాజెక్ట్‌ కోసం సుమారు 3,500 ఎకరాలకు పైగా భూసేకరణ చేపట్టాలని ప్రతిపాదించారు. చెరువులను రిజర్వాయర్‌గా మార్చేందుకు, పైప్‌లైన్లు, కాల్వల నిర్మాణంకోసం భూమిని సేకరిస్తున్నారు. ఇందులో 640 ఎకరాలు అటవీ భూమి కాగా మిగతా 2,900 ఎకరాల్లో పట్టా భూములు, అసైన్డ్‌ భూములున్నాయి. అటవీ భూమిని సేకరించి పైప్‌లైన్లు వేసే కార్యక్రమం చేపట్టగా పనులు కొంతమేర మిగిలిపోయాయి. మిగతా 2,900 ఎకరాల్లో సుమారు 890 ఎకరాలను ఇప్పటి వరకు సేకరించినట్లు అధికారులు తెలిపారు. మిగతా 2వేల ఎకరాల్లో 340 ఎకరాల భూసేకరణకు రైతులను ఒప్పించేందుకు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..

సిట్‌ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Apr 06 , 2025 | 04:42 AM