Home » Kaleshwaram Project
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్లు కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ప్రభుత్వ నిధులను ఎక్కువగా ఖర్చుపెట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) తీవ్రంగా మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం చేసిన అప్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.9-10 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
Kaleshwaram Lift Irrigation Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యాం భద్రతా అథారిటీ (NDSA) కీలక సమావేశం నిర్వహించింది. ఈ ఏడాది మే 5వ తేదీన ఒక నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ..
మేడిగడ్డ ఎందుకూ పనికిరాకుండా పోయిందని సీఎం రేవంత్ సహా ఇతర కాంగ్రెస్, తదితర పార్టీల నేతలు, సోషల్ మీడియా చేసిన దుష్ర్పభావాలు పని చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కారణాలు తెలుసుకునేందుకుగాను తగిన పరీక్షలు చేయాలంటూ తామిచ్చిన నివేదికను అమలు చేశారా? అని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్డీఎ్సఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులకు రూ.11 వేల కోట్లు కేటాయించాల్సిందిగా ఆర్థికశాఖకు ప్రతిపాదనలు అందజేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు ఆమోదం లేకుండానే బ్యారేజీలపై నిర్ణయం తీసుకున్నారని విద్యుత్తు రంగ నిపుణుడు కంచర్ల రఘు చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అంచనాల సవరణ, టెండర్ల ప్రక్రియలో తమ పాత్రేమీ లేదని ఐఏఎస్, విశ్రాంత ఐఏఎస్ అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను మాత్రమే అమలు చేశామని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇవాళ( సోమవారం) దాదాపు 10మంది ఐఏఎస్‌లను విచారించింది. కమిషన్ ఎదుట స్మితా సబర్వాల్, రజత్ కుమార్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, రాహుల్ బొజ్జా, ఎస్.కె.జోషి, కంచర్ల రఘు హాజరయ్యారు. ఇందులో పలువురు తాజా, మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో చోటుచేసుకున్న లోపాలు, అవకతవకలపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం పలువురు తాజా, మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారులను విచారించనుంది.