Home » kaleshwaram
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద జరుగుతున్న మరమ్మతు పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించనున్నారని, ఈ మేరకు సీఎం నాలుగైదు రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద జరుగుతున్న పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు.
ప్రాణహితకు వర్షాకాలం వచ్చే వరద తగ్గుముఖం పట్టాక మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన తాత్కాలికంగా రాతికట్ట కట్టి, నదీ ప్రవాహాన్ని లక్ష్మీ పంప్‌హౌ్‌సకు మళ్లించి, అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీటిని నిల్వ చేసే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల సంఘం షరతుల మేరకు నిర్వహించిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో జరిగిన ఈ భేటీలో సుమారు 4 గంటలపాటు కీలక అంశాలపై మంత్రులు చర్చించారు. కాళేశ్వరం బ్యారేజీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తిస్థాయిలో కాపాడుకొని, ఈ ఏడాది వీటిలో నీటిని నిల్వ చేసి, పంపింగ్ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అన్నారం బ్యారేజీని పుణేలోని కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స)తో, సుందిళ్లను జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ)తో పరీక్షలు చేయించడంతో పా టు ఆ బ్యారేజీలు కట్టిన నిర్మాణ సంస్థలతో మరమ్మతులు చేయించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారుల్లో కలవరం మొదలైంది. భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు బాధ్యులపై, పనులు పూర్తికాకముందే సర్టిఫికెట్ జారీ చేసిన ఇంజనీరింగ్ అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని సీఎం సీరియ్‌సగా తీసుకొని కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారని, తమపై వేటు కూడా వేసి అవకాశముందని ఇంజనీరింగ్ అధికారుల్లో టెన్షన్ మొదలైంది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థితిగతులపై ఏకకాలంలో మూడు కేంద్ర సంస్థలతో అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీని ఢిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక, ఇతర భూపదార్థాల పరిశోధన కేంద్రం(సీఎ్‌సఎంఆర్‌ఎ్‌స)తో, అన్నారం బ్యారేజీని పుణెలోని కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స)తో, సుందిళ్ల బ్యారేజీని హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఏ)తో అధ్యయనం చేయించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ ఎంక్వైరీ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో స్పెషల్ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇరిగేషన్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ అధికారుల బృందం నిన్న ఘోష్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యింది.
BRS Calls Chalo Medigadda: కాళేశ్వరం ప్రాజెక్టును(Kaleshwaram Lift Irrigation Project) కూల్చే కుట్ర చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై(Congress) నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). ఇందులో భాగంగా ‘ఛలో మేడిగడ్డ’కు పిలుపునిచ్చారు కేటీఆర్. మంగళవారం నాడు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. 16 నుంచి 21 వరకు పిల్లర్స్‌కు నష్టం వాటిలినట్టు తమ నివేదికలో విజిలెన్స్ పేర్కొంది. రాఫ్ట్ సపోర్ట్ కొట్టుకుపోవడం వల్ల నష్టం జరిగినట్టు తెలిపింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతీ బ్యారేజీకి అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఐదో బ్లాక్ లోని 28,38 పియర్ల వద్ద పడిన