Home » Kalvakuntla kavitha
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(Kalvakuntla Kavitha) సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 28న విచారణకు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో సీబీఐ(CBI) పేర్కొంది.
Telangana: రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీలో మార్పుల కోసం ఒక మెమో తీసుకువచ్చిందని... ఫిబ్రవరి 10 వ తేదీన జీవో నంబర్ 3ను విడుదల చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జీవో నెంబర్ 3 తో మహిళలకు ఇస్తున్న 33.3 శాతం రిజర్వేషన్లు కోల్పోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రోస్టర్ పాయింట్లో రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు జీవోలో చెప్పిందని అన్నారు.
మ్మెల్సీ, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కవిత సామాజిక మాధ్యమాల వేదికగా వివరించారు. తన ఇన్స్టాగ్రామ్, ఎక్స్ అకౌంట్లు హ్యాక్ అయినట్లు ఆమె వివరించారు.
Telangana Elections: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. ఎన్నికల్లో భాగంగా ఈరోజు(గురువారం) బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్ పోలింగ్ స్టేషన్లో కవిత తన ఓటును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కోడ్ ఉల్లంఘించి బీఆర్ఎస్కు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Telangana Elections: ఎన్నికలు అనగానే ఒక బ్రమ్మ పదార్థం మాకు సంబంధం లేదు అనే ఆలోచన నుండి విద్యార్థులు బయటకు రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం విద్యార్థులు, కొత్త ఓటర్లలతో ఇంటరాక్షన్‌లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఎన్నికలను ఆషామాశీగా తీసుకోవద్దన్నారు. యువతలో చైతన్యం రావాలన్నారు. స్వేచ్ఛ యుతంగా ఉండటం అనేది ముఖ్యమన్నారు. ఈరోజు ఉన్న స్వేచ్ఛ పోకుండా కాపాడుకోవాలని.. ప్రశ్నించటం తెలంగాణ రక్తంలోనే ఉందని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
నామినేషన్ ర్యాలీ ప్రారంభ ప్రదేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్కూటర్‌పై చేరుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్కూటర్‌పై కవిత ప్రయాణిస్తూ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బోధన్‌లో బీఆరెస్ బీసీల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు పక్కా అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..15 తర్వాత కాంగ్రెస్ స్పీడ్ ఎవరూ ఆపలేరన్నారు. బీఆర్ఎస్ చెప్పుకోవడానికి ఏ అంశంపై లేక మళ్లీ తెలంగాణ వాదాన్నే ముందుకు తీసుకొస్తోందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వంపై (central government) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kalvakuntla Kavitha) విమర్శలు గుప్పించారు.