Share News

Kavitha: గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా?

ABN , First Publish Date - 2023-11-17T10:55:03+05:30 IST

కాంగ్రెస్ పార్టీపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Kavitha: గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా?

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై (Congress) బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC KLavitha) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా ???!! ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా? పదేండ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం బాధాకరం! ఈ గడ్డమీద జోడోయాత్రలు చేసి ఒక్కసారి కూడా జై తెలంగాణ చెప్పకపోవడం దారుణం. ఈ రోజుకీ మీకు అమరవీరుల స్థూపానికి దారి తెలియకపోవడం అత్యంత బాధాకరం. సోనియా, రాహుల్‌ గాంధీలు అమరవీరుల స్థూపం ముందు మేకరిల్లినా మీ పాపాలకు ప్రాయుశ్చిత్తం ఉండదు!’’ అంటూ కవిత వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-11-17T10:55:04+05:30 IST