Home » Kamala Harris
అమెరికా ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తున్నాయని భావిస్తున్న స్వింగ్ రాష్ట్రాలను ‘రణక్షేత్ర రాష్ట్రాలు’గా అక్కడి రాజకీయ విశ్లేషణకులు అభివర్ణిస్తున్నారు. అధ్యక్షుడిని నిర్ణయించడంలో ఈ రాష్ట్రాల్లో గెలుపు ముఖ్యమని అంటున్నారు. ఈ రాష్ట్రాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయో ముందే ఊహించడం సంక్లిష్టంగా ఉంటుంది. ఈసారి ఫలితం ఎలా ఉందంటే..
ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత హోరాహోరీగా జరిగాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నువ్వా-నేనా అన్నట్టు తలపడ్డారు. పోటాపోటీగా జరిగిన ఈసారి ఎన్నికల పూర్తి ఫలితాలు వెలువడడానికి చాలా సమయం పట్టొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగియడంతో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. దీంతో అమెరికన్ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠగా మారింది. కొన్ని నాటకీయ పరిణామాలు, కొన్ని పోలింగ్ స్టేషన్లకు బాంబు బెదిరింపులు మినహా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కౌంటింగ్‌పై పడింది.
యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే మాజీ అధ్యక్షుడు, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కంటే డొనాల్డ్ ట్రంప్ చాలా ఆధిక్యంలో కనిపిస్తున్నారు.
డెమోక్రాట్ కమలా హ్యారిస్, రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ ఎన్నికల్లో అమెరికా పౌరులకు ప్రజాస్వామ్య పరిరక్షణ, ఆర్థిక అభివృద్ధి మొదలైనవి అతి ముఖ్యమైన అంశాలుగా నిలిచాయి. ఈ మేరకు ప్రాథమిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
హోరాహోరీగా ప్రచారం కొనసాగిన 47వ అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం తుది అంకానికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా వేర్వేరు కాలమానాల ప్రకారం.. ఆయా రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచి పోలింగ్ ప్రారంభమైంది.
తులసేంద్రపురం గ్రామంలో హారిస్ విజయం కోరుకుంటూ టెంపుల్ సెర్మనీలో స్థానికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ గడ్డపై పుట్టిన ఆడకూతురు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటూ ఆలయం వెలుపల స్థానిక రాజనీయనేత అరుల్‌మొళి సుధాకర్ ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 పోలింగ్ సమయం వచ్చేసింది. ఇవాళ (మంగళవారం) దేశవ్యాప్తంగా ఓటింగ్ జరగనుంది. దీంతో ప్రపంచం దృష్టంతా అటువైపే ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా.. లేక కమలా హారిస్ జయకేతనం ఎగురవేస్తారా? అని ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఎన్నికల్లో పార్టీల అనుకూల-ప్రతికూల-తటస్థ అంశాలకు అనుగుణంగా అమెరికాలోని రాష్ట్రాలను మూడుగా విభజించారు. అవి.. రెడ్, బ్లూ, స్వింగ్ రాష్ట్రాలు. 1980 నుంచి రిపబ్లికన్లు విజయం సాధిస్తూవస్తున్న రాష్ట్రాలను రెడ్ స్టేట్స్ అంటారు.
ఒక వర్గం ఓట్లను ఆకర్షించడానికి రాజకీయం చేస్తే.. అది అడ్డం తిరిగి మరో వర్గం మొత్తానికే దూరమై, మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇది మరోమారు రుజువు కాబోతోందా? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది!