Share News

US Election 2024: అమెరికాలో ఇవాళే అధ్యక్ష ఎన్నికలు.. ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా

ABN , Publish Date - Nov 05 , 2024 | 08:32 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 పోలింగ్ సమయం వచ్చేసింది. ఇవాళ (మంగళవారం) దేశవ్యాప్తంగా ఓటింగ్ జరగనుంది. దీంతో ప్రపంచం దృష్టంతా అటువైపే ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా.. లేక కమలా హారిస్ జయకేతనం ఎగురవేస్తారా? అని ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

US Election 2024: అమెరికాలో ఇవాళే అధ్యక్ష ఎన్నికలు.. ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా

ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తికరంగా గమనిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఇవాళ (మంగళవారం) జరగనుంది. అమెరికన్లు పోలింగ్ బూత్‌లకు తరలివెళ్లనున్నారు. అమెరికాలో నేడు జరిగేవి 60వ అధ్యక్ష ఎన్నికలు. దేశంలో మొత్తం 230 మిలియన్ల మంది ఓటర్లు ఉండగా అందులో 160 మిలియన్ల మంది (సుమారు 16 కోట్లు) మాత్రమే ఈసారి ఓటు కోసం పేరు నమోదు చేసుకున్నారు. ఇక 70 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లు లేదా ముందస్తు పోలింగ్ స్టేషన్ల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు పోలింగ్ ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. అయితే రాష్ట్రాలను (స్థానిక కాలమానం) బట్టి ఎన్నికల టైమింగ్స్ మారుతూ ఉంటాయి. మన మాదిరిగా కాకుండా అమెరికాలో ఓటింగ్ మొదలైన తర్వాత ఎగ్జిట్ పోల్స్ రావడం ప్రారంభమవుతాయి. అంతేకాదు అన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలవుతుంది. చిన్న రాష్ట్రాలలో ముందుగానే ఫలితాలు వెలువడతాయి. ఇక కొన్ని కీలకమైన రాష్ట్రాల్లో ఫలితాల కౌంటింగ్‌ ప్రక్రియ ముగియడానికి కొంత సమయం పడుతంది. కాగా ప్రచార పర్వంలో నువ్వా-నేనా అన్నట్టుగా తలపడ్డ డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల గట్టి పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.


ఎన్నికల్లో కీలక అంశాలు ఇవే..

ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిత్యవసరాల ధరలు, జీవన వ్యయాలు, భవిష్యత్తు ఆర్థిక భద్రత వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి. అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ నాలుగు సంవత్సరాల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటివరకు అక్కడ ఇంటి ఖర్చలు, గృహోపకరణాలు, బీమా వంటి సేవల ధరలు 10-40 శాతం మధ్య పెరిగాయి. పెట్రోల్ ధరలు మరింత ఎక్కువ పెరిగాయి. వడ్డీ రేట్లు తగ్గినప్పటికీ అక్కడివారు ఏమాత్రం సంతోషంగా లేరు. ఈ అంశమే ట్రంప్‌కు కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థను నిర్వహించడానికి ఎవరు బెస్ట్ అని అడిగితే.. అత్యధికులు మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కే ఓటు వేస్తున్నారు. ఇక స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్‌ను కోరుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది.


ఇక ఇమ్మిగ్రేషన్ కూడా అతిపెద్ద సమస్యగా ఉంది. ట్రంప్ మొదటిసారి పాలనలో కనికరం లేకుండా ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని నిర్వహించారు. మెక్సికోతో సరిహద్దు నియంత్రణలో లేదని, ఈ ప్రభావంతో నేరాలు, దోపిడీలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గోడ నిర్మాణానికి ప్రతిపాదన కూడా చేశారు. ఇక తాను మరోసారి అధికారంలోకి ఇమ్మిగ్రేషన్ విధానాన్ని మరింత కఠినతరం చేస్తానంటూ ఆయన హామీలు ఇస్తున్న విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి

విమానాల్లో ప్రయాణిస్తుంటారా.. కీలక మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం

నాలుగేళ్ల తర్వాత తొలిసారి.. చైనా సరిహద్దులో..

ఇవాళ విరాట్ కోహ్లీ బర్త్‌డే.. ఎన్నేళ్లు నిండాయో తెలుసా

రోహిత్‌ శర్మను ఉద్దేశించి సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

For more Sports News and Telugu News

Updated Date - Nov 05 , 2024 | 11:05 AM