US Election 2024: అమెరికాలో ఎన్నికల కౌంటింగ్ మొదలు.. లీడ్‌లో ఎవరు ఉన్నారంటే
ABN , Publish Date - Nov 06 , 2024 | 07:03 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగియడంతో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. దీంతో అమెరికన్ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠగా మారింది. కొన్ని నాటకీయ పరిణామాలు, కొన్ని పోలింగ్ స్టేషన్లకు బాంబు బెదిరింపులు మినహా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కౌంటింగ్‌పై పడింది.
అమెరికా తదుపరి ప్రెసిడెంట్ ఎవరు?. తొలిసారి ఒక మహిళ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడుతారా? లేక డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారా?.. అనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లోనే తెరపడనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగియడంతో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. దీంతో అమెరికన్ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠగా మారింది. పలుచోట్ల నాటకీయ పరిణామాలు, కొన్ని పోలింగ్ స్టేషన్లకు బాంబు బెదిరింపులు మినహా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కౌంటింగ్‌పై పడింది.
ప్రస్తుతానికి లీడ్‌లో ట్రంప్
డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నువ్వు-నేనా అన్నట్టుగా నెలల తరబడి ప్రచారం సాగించిన విషయం తెలిసిందే. వీరిద్దరిలో ఒకర్ని అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ అమెరికన్ ఓటర్లు తమ తీర్పు ఇచ్చేశారు. బ్యాలెట్ బ్యాక్సుల నిక్షిప్తమైన ఉన్న ఆ ఫలితం వెల్లడి కావడమే మిగిలివుంది. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఇండియానా, కెంటుకీ, వెస్ట్ వర్జీనియా రాష్ట్రాలలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లీడ్‌లో ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో ఆయనకు భారీగా ఓట్లు పడ్డాయని కౌంటింగ్ సరళిని బట్టి అర్థమవుతోంది.
ఇక ప్రత్యర్థి కమలా హారిస్ వెర్మోంట్ రాష్ట్రాన్ని దక్కించుకున్నారని కథనాలు వెలువడుతున్నాయి. జార్జియా, నార్త్ కరోలినాతో పాటు అత్యంత కీలకమైన మరో 9 రాష్ట్రాలలో పోలింగ్ ముగియడంతో కౌంటింగ్ షురూ అయింది. జార్జియా, నార్త్ కరోలినా, ఆరిజోనా, మిచిగాన్, నెవాడా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్.. ఈ ఏడు రాష్ట్రాలలో ప్రారంభ ఫలితాలు రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఫ్లోరిడా, అలబామా, సౌత్ కరోలినా, మిస్సిసిపి రాష్ట్రాలను గెలవబోతున్నారని కథనాలు వెలువడుతున్నాయి. కాగా మేజిక్ ఫిగర్ 270గా ఉంది.
తుది సర్వేల్లో కమల వైపు మొగ్గు
అమెరికా ఎన్నికల పోలింగ్‌కు ముందు వెలువడిన తుది సర్వేల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ వైపు స్వల్పంగా మొగ్గు ఉందని, ఆమె ముందంజలో ఉన్నారని సర్వేలు తెలిపాయి. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయని భావిస్తున్న ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో హోరాహోరీ పోరు ఖాయమని విశ్లేషించాయి. విశ్వసనీయత కలిగిన ‘అలన్ లిచ్‌మన్’ సర్వే కూడా కమలా హారిస్ గెలుస్తారని లెక్కగట్టింది. కాగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో తన ఓటు వినియోగించుకున్నారు. ప్రత్యర్థి కమలా హారిస్ మెయిల్ ద్వారా ముందస్తుగానే ఓటు వేశారు.
ఇవి కూడా చదవండి
అమెరికా ఎన్నికల వేళ విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా ఎన్నికల ఫలితాల ట్రెండ్ ఇదే.. డెమొక్రాట్లకు బైడెన్ అభినందనలు
ఐపీఎల్ వేలంలో పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్ ఇదే
For more International News and Telugu News