Home » Kannada
నటుడు దర్శన్‌పై నమోదైన హత్యకేసు విచారణలో పలు విషయాలు బహిర్గతమవుతున్నాయి. బహచిత్రదుర్గ నివాసి రేణుకాస్వామిని హత్య చేసి, ఆ నేరాన్ని ఒప్పుకునేందుకు నలుగురు యువకులకు రూ.30లక్షలు ఇచ్చేలా డీల్ కుదిరినట్లు పోలీసుల విచారణలో తేలింది.
కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో కమలం పార్టీ 17 స్థానాలు కైవసం చేసుకోగా.. మిత్రపక్షం జేడీఎ్‌సకు 2 దక్కాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 9 స్థానాలకు పరిమితమైంది.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ తెలుగు, కన్నడ నటి పవిత్ర జయరామ్ (42) మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు వేగంగా డివైడర్‌ను ఢీకొట్టి.. దాని పైనుంచి అవతలివైపు రోడ్డు మీదకు దూసుకెళ్లింది. ఆ లేన్‌లో వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టి నుజ్జయింది. పవిత్రది కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా ఉమ్మదహల్లి గ్రామం. ఆమెతో పాటు పినతల్లి కుమార్తె ఆపేక్ష, మరో నటుడు చంద్రకాంత్ (చందు), డ్రైవర్ శ్రీకాంత్‌తో కలిసి శనివారం సాయంత్రం కారు (స్కార్పియో)లో బెంగళూరు నుంచి హైదరాబాదుకు బయలుదేరారు.
కర్ణాటకలో భాషా వివాదం మరింత ముదిరింది. దుకాణాదారులు, ఇతర వ్యాపారులు తమ సైన్ బోర్డులలో 60 శాతం వరకూ కన్నడ భాషనే వినియోగించాలన్న ఆదేశాలు వచ్చిన తర్వాత ‘‘కర్ణాటక రక్షణ వేదికే’’ (కేఆర్వీ) అనే మితవాత గ్రూపు సభ్యులు..
కర్ణాటకలో ప్రస్తుతం ‘పులిగోరు’ వివాదం నడుస్తోంది. ఎప్పుడైతే బిగ్‌బాస్ కంటెస్టంట్ వర్తుర్ సంతోష్ పులిగోరు ధరించి కనిపించాడో.. అప్పటి నుంచి ఈ వివాదం తెరమీదకు వచ్చింది. ఈ వివాదంలో కన్నడ ప్రముఖులు...
కన్నడ నటుడు నాగభూషణ కర్ణాటకలోని బెంగళూరులో కారును వేగంగా నడుపుతూ ఫుట్‌పాత్‌పై ఉన్న జంటను ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. శనివారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆయన కారు తొలుత విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వసంతనగర్ మెయిన్ రోడ్డుకు సమీపంలో వాకింగ్ చేస్తున్న జంటను ఢీకొంది.
కన్నడ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. వర్దమాన సినీ, టెలివిజన్ నటుడు నితిన్ గోపీ శనివారంనాడు గుండెపోటుతో కన్నుమూశారు. 39 ఏళ్ల నితిన్ గోపీ కన్నడ లెజెండ్రీ నటుడు డాక్టర్ విష్ణువర్ధన్ 'హల్లో డాడీ' చిత్రంలో బాలనటుడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు బీజేపీ తీర్థం స్వీకరించనున్నారు....
భాషలకు తగిన మద్దతు ఇవ్వకుండా రాజకీయ పార్టీలు ఆటలాడుకుంటున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
‘బాహుబలి’, ‘కేజీయఫ్’, ‘పుష్ప’ వంటి చిత్రాల కారణంగా సౌతిండియా చిత్రాలకి పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ వచ్చింది.